Bandi Sanjay: దేశంలో డిజిటల్ విప్లవం నడుస్తున్న తరుణంలో ఊహించని రీతిలో సైబర్ దాడుల ముప్పు కూడా పెరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Minister Bandi Sanjay Kumar) అన్నారు. హైదరాబాద్ రామాంతాపూర్ లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(Central Detective Training Institute)లో బీపీఆర్ అండ్ డీ(BPR&T), టీజీసీఎస్ బీ(TGCSB), ఐఎస్ బీ(USB) సంయుక్తంగా గురువారం నేషనల్ పోలీస్ హ్యాకథాన్ ‘సైఫర్‌కాప్ 2025’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. సైబర్ కాప్ 2025 విజేతలను అభినందిస్తూ ట్రోఫీలు, సర్టిఫికెట్లను బండి ప్రదానం చేశారు. దీంతోపాటు సీడీటీఐ త్రైమాసిక పత్రిక ‘హారిజన్’ను ఆవిష్కరించారు. అనంతరం బండి మాట్లాడుతూ.. సైబర్ దాడులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సమస్యలకు స్వదేశీ పరిష్కారాలను అందించే దిశగా కృషి చేయాల్సి ఉందన్నారు.
క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ట్రాక్..
అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లు, ప్రొఫెషనల్స్, విద్యార్థులను ఒకచోట చేర్చి వారు చేపట్టే కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలతో పౌరులను, సంస్థలతోపాటు ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అవసరమైన సాధనాలను రూపకల్పన చేసేందుకు వేదికలుగా ‘హ్యాకథాన్’ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందననీయమన్నారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ట్రాక్ చేయడం, డీప్‌ఫేక్ వీడియో(Deep Fake Videos)లు, వెబ్‌సైట్లు, మొబైల్ అప్లికేషన్లను ఎదుర్కోవడానికి క్రుషి చేస్తున్నారని అన్నారు. సైబర్ సెక్యూరిటీ, సైబర్ నేరాల డైనమిక్ సవాళ్లను ఎదుర్కోవడం ముందున్న ముఖ్యమైన కర్తవ్యమని, వీటిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
Also Read: Telugu Reality Show: సామాన్యులకు బంపరాఫర్.. ఆ రియాలిటీ షోలో గెలిస్తే 10 లక్షలు మీ సొంతం!
ముగిసిన ఆలిండియా 7వ ప్రిజన్ డ్యూటీ మీట్ సమావేశాలు
వివిధ నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తిరిగి సమాజంలోకి వెళ్లే సమయానికి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే జైళ్ల శాఖ సాధించే అసలైన విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జైళ్ల శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, న్యూఢిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఆలిండియా 7వ ప్రిజన్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి బండి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ఈ మహోత్సవంలో 22 ఈవెంట్ల కోసం మొత్తం 26 ట్రోఫీలు, 40 పతకాలు ప్రదానంచేశారు. ఇందులో తెలంగాణ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. తెలంగాణ అత్యధికంగా 17 ట్రోఫీలు గెలుచుకుంది. కాగా పతకాలు, ట్రోఫీలు గెలుచుకున్న వారికి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి బండి సంజయ్ బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ విజయవంతంగా నిర్వహించబడటంలో బీపీఆర్డీ, తెలంగాణ జైళ్ళ శాఖ భాగస్వామ్యం ప్రశంసనీయమైనదని కొనియాడారు.
Also Read: Viral News: కారులోంచి దూకి ప్రియుడు మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాక్