Telugu Reality Show: అదిరిందయ్యా గేమ్ షో..
game ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Telugu Reality Show: సామాన్యులకు బంపరాఫర్.. ఆ రియాలిటీ షోలో గెలిస్తే 10 లక్షలు మీ సొంతం!

Telugu Reality Show: రియాలిటీ షోల జోరు రోజు రోజుకి పెరుగుతుంది. ప్రముఖ టీవీ ఛానెల్స్  ఒక దానికి మించి ఒకటి కొత్తగా మన ముందుకు  తీసుకొస్తున్నారు. టెలివిజన్ ఛానల్స్, ఓటీటీ వేదికల్లో హోరెత్తుతున్న తరుణంలో, ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సరికొత్త రియాలిటీ షో ‘ది లక్’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సామాన్యుల కోసం కొత్తగా అలోచించి, సమకాలీన పరిస్థితులను ఆధారంగా రూపొందిన ఈ షో, స్థైర్యం, వ్యూహం, ఓర్పును పరీక్షించే సవాళ్లతో ఆకట్టుకోనుంది. తాజాగా, ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ఈ షోకు సంబంధించి ఓ ప్రెస్ మీట్ నిర్వహించి, ‘ది లక్’ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ షోను ఒక ప్రముఖ సెలబ్రిటీ హోస్ట్ చేయనున్నారని, ఇది యూట్యూబ్‌తో పాటు ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుందని సంస్థ వెల్లడించింది.

Also Read: Urea Distribution: మహబూబాబాద్ రైతు వేదిక వద్ద 980 మెట్రిక్ టన్నుల యూరియా టోకెన్ల పంపిణీ కోసం బందోబస్తు

సవాళ్లు, బహుమతులు, ఉచిత పాల్గొనే అవకాశం..

‘ది లక్’ రియాలిటీ షోలో పాల్గొనేవారు స్థైర్యం, వ్యూహాత్మక ఆలోచన, ఓర్పును పరీక్షించే విభిన్న సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విజేతలకు 10 లక్షల రూపాయల నగదు బహుమతి లభిస్తుందని, పార్టిసిపెంట్స్‌ను ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంచుకుంటామని నిర్వాహకులు తెలిపారు.

Also Read: Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్

విశేషం ఏమిటంటే, ఈ షోలో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఉచితంగా అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాదు, షోలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక బహుమతి కూడా ఉంటుందని ప్రజా ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం కొద్దీ రోజులు వేచి చూడాలని చెప్పారు. ‘ది లక్’ షోకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. సామాన్యులకు సైతం తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తూ, ఉత్కంఠభరితమైన సవాళ్లతో ‘ది లక్’ రియాలిటీ షో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Also Read: Mahabubabad Protest: ఇజ్రాయిల్‌ పెట్టుబడి ఒప్పందం సిగ్గుచేటు.. వెంటనే రద్దు చేయాలని సీపీఐ నేతల డిమాండ్!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..