Urea Distribution: యూరియా కొరతను మహబూబాబాద్ జిల్లా అధికారులు రోజు కొంత తీరుస్తూ వస్తున్నారు. రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా 64 యూరియా పంపిణీ కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ల ఆధ్వర్యంలో జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మొదట యూరియా కోసం రైతులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తూ ఇబ్బందులకు గురయ్యారు. వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు పకడ్బందీ ప్రణాళిక చర్యలను చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ స్వయంగా యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ వస్తున్నారు. బాస్ ఇచ్చిన ఆదేశాలతో 18 పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది 64 సెంటర్ల వద్ద ప్రత్యేకమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read: MLA Dr. Rajesh Reddy: సమాజానికి సేవ చేసే జర్నలిస్టుల ఆరోగ్యం ఎంతో ముఖ్యం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
64 సెంటర్లలో 980 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణి
మహబూబాబాద్ జిల్లాలో 64 సెంటర్లలో 980 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే రైతులు రైతు వేదికల వద్ద, అలాగే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టోకెన్ కేంద్రాల వద్ద రైతులకు యూరియా పంపిణీ చేసేందుకు టోకెన్లను అందిస్తున్నారు. టోకెన్లు తీసుకెళ్లి 64 సెంటర్ల వద్ద యూరియాను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టారు. ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 26 వేల 520 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. టార్గెట్ 40,540 మెట్రిక్ టన్నులకు గాను గురువారంతో 26,520 పంపిణీ ప్రక్రియ పూర్తవుతుంది. ఇంకా 14,020 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేస్తే రైతులకు సేద్యం చేసుకుంటున్నా వ్యవసాయ క్షేత్రాలకు సరిపోతుంది.
Also Read: Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్
గత రెండు రోజులుగా రైతు వేదిక వద్ద టౌన్ సిఐ మహేందర్ రెడ్డి బందోబస్తు
ఇప్పటికే మహబూబాబాద్ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టిన పోలీస్ యంత్రాంగం నేడు 980 టన్నుల యూరియా పంపిణీ చేయనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 64 సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతు వేదిక వద్ద గత రెండు రోజులుగా మహబూబాబాద్ టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి మకాం వేసి అక్కడికి వచ్చిన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకించి క్లస్టర్ల వైజ్ గా విభజించి రైతులు ఆయా క్లస్టర్ల ఏ ఈ ఓ ల ద్వారా యూరియా వస్తున్న విషయం, పంపిణీ ప్రక్రియ తెలుసుకునేలా పోస్టర్లను అంటించి కౌన్సిలింగ్ నిర్వహించారు. తమ సిబ్బందితో నిత్యం రైతు వేదిక, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేకమైన బందోబస్తు చర్యలు పకడ్బందీగా చేపడుతున్నారు.