MLA Dr. Rajesh Reddy: సమాజానికి సేవ చేసే జర్నలిస్టులకు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని నాగర్‌కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి (MLA Dr. Rajesh Reddy) అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్ మలక్ పేట్ యశోద హాస్పిటల్, శ్రీ నేత్ర సనత్ నగర్ వారి సహకారంతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్సులో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, రత్నగిరి ఫౌండేషన్ చైర్మన్ జూపల్లి అరుణ్ రావు, హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Also Read: Nepal Gen Z Protest: నేపాల్ మహిళా మంత్రిని.. చావగొట్టిన నిరసనకారులు.. వీడియో వైరల్
ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ..
జర్నలిస్టు వృత్తి సమాజంలో ఎంతో బాధ్యతయుతమైనదని, ప్రజల సమస్యలను పరిష్కరింపచేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమని, అలాంటి జర్నలిస్టులు ప్రజలకు సేవ చేయాలంటే ఆరోగ్యం ముఖ్యమని తెలిపారు. మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన ఐజేయూ యూనియన్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన పరీక్షలు తప్పక చేసుకోవాలన్నారు. జర్నలిస్టులు ప్రజల కోసం సేవ చేయాలంటే ముందు వారికి ఆరోగ్యమే ప్రధానం అన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు తనకు మధ్య వారధిలా పని చేస్తు అనునిత్యం వార్తల సేకరణ లో ఉండే జర్నలిస్ట్లు తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్త వాహించాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లే జర్నలిస్టులకు ప్రత్యేక ఒపీని ఏర్పాటు చేయడానికి డాక్టర్లతో మాట్లాడుతానని ఆయన తెలిపారు.
ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ..
జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, శరీరం కూడా ఒక ఆర్గానిక్ యంత్రం లాంటిదని, దానికి పరీక్షలు అవసరమన్నారు. ఈసీజీ, టు డీ ఇకో, రక్త పరీక్షల లాంటి బేసిక్ పారామీటర్స్ చూసుకోవాలన్నారు. ఒత్తిడితో కూడిన ఈ వృత్తిలో ఆహారపు అలవాట్లు, దినచర్య అలవర్చుకోవాలని కోరారు. యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ సభ్యులు, యశోద ఆసుపత్రి వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. తాము కూడా పోలీస్ పోలీస్ సిబ్బందికి అమ్రాబాద్ లో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ హెల్త్ క్యాంపులు జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. జర్నలిస్టులు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని జర్నలిస్టు సంఘాల నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రత్నగిరి ఫౌండేషన్ చైర్మన్ జూపల్లి అరుణ్ రావు మాట్లాడుతూ..
ప్రజల శ్రేయస్సుకు అహర్నిశలు కష్టపడే జర్నలిస్టులు, వారి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని, రాష్ట్ర ప్రస్ అకాడమీ చైర్మన్ చెరువుతోని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నందుకు చాలా సంతోషించదగ్గ విషయమని ఆయన తెలిపారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ… ఒకప్పటి జర్నలిజానికి, నేటి జర్నలిజానికి చాలా మార్పు వచ్చిందని, పోటీ తత్వం పెరిగిందని తెలిపారు. సోషల్ మీడియా ప్రాబల్యం ఎక్కువైందని నిజా నిజాలు తెలియకుండా వార్తలను వ్యాప్తి చేస్తున్నారన్నారు. జర్నలిజం నైతిక విలువలను కాపాడుకునేందుకు ఇదివరకే జిల్లాలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగిందన్నారు.
Also Read: Day Care Centers: క్యాన్సర్ నివారణ పై సర్కార్ ఫుల్ ఫోకస్.. అందుకు ప్రణాళికలు ఇవే..!
