Nepal Gen Z Protest: నేపాల్ లో జెన్ జెడ్ (Gen Z) నిరసనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆ దేశ రాష్ట్రపతి భవన్, ప్రధాని ఇళ్లకు సైతం నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆర్థిక మంత్రిని రోడ్డుపై పరిగెత్తించి మరి కొట్టిన ఘటనలు.. సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ క్రమంలోనే నేపాల్ విదేశాంగ మంత్రిని సైతం నిరసనకారులు తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. ఒక మహిళ అని చూడకుండా ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. రక్తం కారుతున్న ముఖంతో ఉన్న ఆమె నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రాణాల కోసం అర్ధించిన మంత్రి
సోషల్ మీడియా నిషేధంపై ప్రారంభమైన నిరసనలు.. నేపాల్ లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాయి. ఆందోళనలు తీవ్రతరం అవుతుండటంతో నిరసనకారుల డిమాండ్ మేరకు ప్రధాని కేపీ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. అయితే తమ పాలకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. నేపాల్ ప్రధాని, మంత్రుల ఇళ్లపై జెన్ జెడ్ నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న నేతనలు తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలోనే నేపాల్ విదేశాంగ మంత్రిగా ఉన్న డాక్టర్ అర్జూ రాణా దేబా (Dr Arzu Rana Deuba) పైనా అందోళనకారులు దాడి చేశారు. తన ప్రాణాలను కాపాడాలంటూ ఆమె అర్థిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
❗️ Nepal’s Former PM Sher Bahadur Deuba and His Wife – Current FM Arzu Rana Deuba – Left Bloodied & Dazed amid Mass Protests#Kathmandu #Nepal pic.twitter.com/LFVsJ52WFc
— RT_India (@RT_India_news) September 9, 2025
అప్పుడలా.. ఇప్పుడిలా
సెప్టెంబర్ 4న విదేశాంగ మంత్రిగా ఎంతో హుందాగా కనిపించినా డాక్టర్ అర్జూ రాణాదేవా.. తాజా అల్లర్ల నేపథ్యంలో ముఖంపై రక్తంతో దిన స్థితిలో ఉండటం ఆవేదన కలిగిస్తోంది. ఈ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన విమానాలను సెప్టెంబర్ 4న ఆమె జాతికి అంకితం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను నేపాల్ విదేశాంగ శాఖ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అమెరికా ప్రభుత్వం తమకు నిరంతర సహకారం అందిస్తున్నందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అందించిన విమానాలు నేపాల్ సైన్యం విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
Hon. Minister for Foreign Affairs Dr. Arzu Rana Deuba unveiled two aircrafts provided by the US Government to the Nepali Army at a special handover ceremony held at the Mid-Airbase of Tribhuvan International Airport today.
In her remarks as Chief Guest, the Foreign Minister said… pic.twitter.com/LHteAZwlqf
— MOFA of Nepal 🇳🇵 (@MofaNepal) September 4, 2025
నేతలపై దాడికి కారణమదే!
సోషల్ మీడియా బ్యాన్ ను వ్యతిరేకిస్తూ నేపాల్ లో మెుదలైన జెన్ జెడ్ నిరసనలు.. మహా ఉద్యమంగా మారాయి. సోమవారం రోజున భద్రతా బలాగాల దాడిలో 19 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోవడంతో.. నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ఈ మరణాలపై ఆగ్రహంతో ప్రజలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. నేతలపై దాడులు చేశారు. అల్లర్లను అణచివేయడానికి ప్రయత్నించి విఫలమైన ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధాని రాజీనామా చేసిన తర్వాత సైన్యం అధికారం చేపట్టి, కర్ఫ్యూ విధించింది. దోపిడీలు, ధ్వంసం, దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also Read: YS Jagan: అట్టర్ ఫ్లాప్ సినిమాకు.. బలవంతపు విజయోత్సవాలా.. సూపర్ సిక్స్‌పై జగన్ సెటైర్లు
నిరసనకారులతో రాష్ట్రపతి చర్చలు
నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ నేడు నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమై సంక్షోభ పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. పౌడెల్ మాట్లాడుతూ ‘అందరూ ప్రశాంతంగా ఉండాలి. దేశానికి మరింత నష్టం జరగకుండా చూడాలి. ప్రజాస్వామ్యంలో పౌరుల డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించవచ్చు’ అని స్థానిక మీడియాతో అన్నారు.