Hyderabad Tragedy: శోభాయత్రా ముగింపు దశలో కరెంట్ షాక్ తో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మరో నలుగురకి గాయాలు. స్థానిక మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో బాగంగా శ్రీకృష్ణ శోభాయాత్ర ముగింపు సమయంలో రథాన్ని తీసుకెళ్లే వెహికిల్ ఆగిపోవడంతో, ఓ పది మంది రథాన్ని నెడుతున్న క్రమంలో రథం పైన ఉన్న విద్యుత్ తీగలు రథానికి తాకడంతో జరిగిన సంఘటన, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు మృతదేహాలను మాట్రిక్స్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి పోలీసులు తరలించారు.
మరో ఇద్దరు స్థానికంగా చికిత్స
గాయాలైనా వారిలో ఒకరు మాట్రిక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, మరొకరు నాంపల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది. మరో ఇద్దరు స్థానికంగా చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. మృతుల వివరాలు కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్(21 ఓల్డ్ రామంతపూర్), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34 ఓల్డ్ రామంతపూర్), రుద్ర వికాస్(39 పద్మశాలి), రాజేంద్ర రెడ్డి(45) ఘటన పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సుమారు అర్ధరాత్రి ఒంటి గంట మధ్య సమయంలో రామంతాపూర్ గోకులే నగర్ లోని యాదవ్ సంఘం ఫంక్షన్ హాల్ వద్ద సంఘటన జరిగింది.
Also Read: shuttlecock shortage: చైనాలో మారిన ఆహారపు అలవాట్లు.. ప్రపంచవ్యాప్తంగా షటిల్‌కాక్స్ కొరత
❄️కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం
❄️రథనాకి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి
❄️మరో నలుగురికి తీవ్ర గాయాలు
❄️మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి దుద్దిళ్ల
❄️ఒక్కొక్కరి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని రామాంతాపూర్ గోకుల్‌నగర్(Ramantapur Gokulnagar)లో నిర్వహించిన రథయాత్రలో పెను విషాదం చోటు చేసుకున్నది. దేవుడి విగ్రహాన్ని తరలిస్తున్న రథంపై భాగం 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో దానిని ముందుకు తోస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ఇక, దుర్ఘటన గురించి తెలియగానే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చారు.
బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపిస్తామని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, కరెంట్ షాక్‌తో మరణించిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు రామాంతాపూర్ మెయిన్ రోడ్డుపై ధర్నాకు దిగారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దుర్ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మృతుల కుటుంబీకులను పరామర్శించారు.
Also Read: Heavy Rains in Medchal: మేడ్చల్‌లో భారీ వర్షాలు.. ఆ గ్రామానికి రాకపోకలు బంద్!
ఏం జరిగిందంటే…
కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రామాంతాపూర్ ప్రాంతంలోని గోకుల్‌నగర్ యాదవ సంఘం నేతృత్వంలో ఆదివారం రథయాత్ర నిర్వహించారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని రథంలో కూర్చబెట్టి వేలాది మంది దాని వెంట భజనలు చేస్తూ, ఆడుతూ పాడుతూ ముందుకు కదిలారు. అయితే, రథాన్ని లాగడానికి ఏర్పాటు చేసిన వాహనం ఆగిపోయింది. దాంతో యాత్రలో ఉన్నవారు జై శ్రీకృష్ణ అని జయ జయ ధ్వానాలు చేస్తూ చేతులతో రథాన్ని ముందుకు తోస్తూ యాత్రను కొనసాగించారు.
మరో వంద మీటర్ల దూరం దాటితే యాత్ర ముగుస్తుందనగా రథం పై భాగం 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దాంతో రథాన్ని తోస్తున్న వారిలో తొమ్మిది మంది విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయారు. దాంతో యాత్రలో ఉన్నవారు వారిని బతికించడానికి సీపీఆర్ జరిపారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. కరెంట్ షాక్‌కు గురైన వారిలో ఓల్డ్ రామాంతాపూర్ నివాసి కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్ (21), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (45) అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ మరో నలుగురిని రామాంతాపూర్, నాంపల్లిలోని వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించారు. వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
కేబుల్ వైర్‌కు విద్యుత్ సరఫరా
కేబుల్ వైర్‌కు విద్యుత్ సరఫరా జరగడం వల్లనే ప్రమాదం సంభవించినట్టు టీజీఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ ఫారూఖీ చెప్పారు. ప్రమాదం జరిగిన చోట 11కేవీ విద్యుత్ తీగలు ఉన్నట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని రెండు భవనాలను అనుసంధానం చేస్తూ నిరుపయోగంగా ఉన్న స్టార్ కేబుల్ వైరు తెగి 11 కేవీ విద్యుత్ తీగల మీదుగా వేలాడుతూ రథం పై భాగంలో ఇనుముతో ఏర్పాటు చేసిన ఫ్రేంకు తగిలి విద్యుదాఘాతం జరిగిందని వివరించారు.
కేబుల్ వైరులోని రాగి తీగల ద్వారా విద్యుత్ ప్రసరణ జరిగిందని చెప్పారు. ఈ విషయం తెలియగానే విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాద స్థలానికి వచ్చినట్టు చెప్పారు. దీంట్లో తమ శాఖ అధికారుల నిర్లక్ష్యం లేదన్నారు. అయినా, జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హబ్సీగూడ సూపరిండింటెంట్ ఇంజినీర్ ప్రతిమ షోమ్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు
