Heavy Rains in Medchal: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మేడ్చల్(Medchal) మున్సిపల్ పరిధిలోని గౌడవల్లి(Gowdavalli) నుండి వచ్చే కాలువ పొంగిపొర్లుతోంది. ఈ కాలువ మేడ్చల్(Medchal) పెద్ద చెరువులో కలుస్తుంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మేడ్చల్(Medchal) నుండి గౌడవల్లికి వాహనాల రాకపోకలను పోలీసు(Police)లు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో, ప్రజలు కాలువ వద్దకు చేరుకుని నీటి ప్రవాహాన్ని చూస్తున్నారు. మత్స్యకారులు చేపలు పడుతున్నారు.
Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు
ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో
ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని లింగాపూర్(Lingapur) గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షాలకు లింగాపూర్(Lingapur) గ్రామ కాలువ పొంగిపొర్లడంతో, గ్రామానికి వెళ్లే రహదారిపై నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగాపూర్(Lingapur) వెళ్లాలంటే నూతనకల్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. డబిల్ పూర్ తో పాటు పలు గ్రామాలకు వెళ్లేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిం
షామీర్పేట్(Shamirpet)లో రాత్రి కురిసిన వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలో లక్ష్మాపూర్ చెరువు ఆలుగు పారడంతో పాటు ఉద్ద మర్రి, అలియాబాద్ గ్రామ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడం రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీ వాహనాలను అనుమతిస్తున్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.