Khammam Rains(image CREDIT: TWITTER)
నార్త్ తెలంగాణ

Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

Khammam Rains: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్(Khammam Police Commissioner) సునీల్ దత్ సూచించారు. రహదారులపై వాగులు వంకలు, ఉదృతంగా ప్రవహిస్తుండడంతో దాటేందుకు ప్రయత్నాలు చేయవద్దని వివరించారు. ప్రధానంగా వాగులు వంకలు అన్ని ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్లు జలమయ్యే ప్రాంతాలలో ప్రజలు ప్రయాణాలను విరమించుకోవాలని సూచించారు. పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా చేపల వేటకు వెళ్లేవారు, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటుద్దని స్పష్టం చేశారు. అత్యవసర సమయంలో డయల్ 100 కు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111 సమాచారం అందించాలని చెప్పారు.

Also Read:SC on Aadhar card: పౌరసత్వానికి ‘ఆధార్‌ ప్రూఫ్ కాదు’.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు 

ఇప్పటికే చెరువులు వాగుల వద్ద పెట్రోలింగ్
మహబూబాబాద్,(Mahabubabad) ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో ఇప్పటికే చెరువులు, వాగుల వద్ద పోలీసులు(Police) పెట్రోలింగ్ పెంచారు. ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టాలపై భారీ కేట్స్ ఏర్పాట్లు చేసి ప్రమాదాల బారిన పడకుండా వాహన రాకపోకలను నిషేధించాలని ఆంక్షలు విధించారు. ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాల మూలగా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, అధికారులు ప్రజలు కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు
మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా ఎగో ప్రాంతంలో గతం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. కొత్తగూడా మండలంలోని గుంజేడు బాబు ఉదృతం కావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కొత్తగూడ.. నర్సంపేట.. ఇల్లందు రవాణా నిలిచిపోయింది. గుంజేడు వాగు దగ్గర కొత్తగూడ పోలీసులు కొత్తగూడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేసముద్రం మండలం అర్పణ పల్లి వద్ద వాగు భారీ వరద నీరు పారుతోంది. కేసముద్రం… గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు పాకాల వాగు రావడంతో గూడూరు.. నెక్కొండ మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి. పాకాల వాగు దగ్గరకు వెళ్లకుండా అధికారులు భారీ కేడ్స్ ఏర్పాటు చేశారు.

కొమరం సారయ్య గడ్డి గుడిసె కుప్పకూలింది

మహబూబాబాద్‌(Mahabubabad)లో మున్నేరు పాలేరు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా లో వాగులు, వంకలు భారీగా ప్రవహిస్తుండడంతో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ముప్పారం వద్ద పాలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మండలంలోని కొత్తూరు మట్ల గూడెం పంచాయతీకి చేరువలో ఉన్న బొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన కొమరం సారయ్య గడ్డి గుడిసె కుప్పకూలింది. దీంతో రాత్రికి రాత్రి ఇంటి సమీపంలోని బాత్రూంలోకి సారయ్య చేరుకొని అక్కడే ఉంటున్నాడు. భారీగా కురుస్తున్న వర్షాలకు గిరిజన గ్రామాల ప్రజలు బయటకు రావడం లేదు. సారయ్య భార్య ఐదు రోజుల క్రితం మృతి చెందగా ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కావడంతో అత్తగారింట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే గుడిసె కూలిపోవడంతో సారయ్య పరిస్థితి దీనస్థితిలో ఉంది.

 Also Read: BSF Recruitment 2025: 3588 కానిస్టేబుల్ జాబ్స్.. అస్సలు వదులుకోకండి!

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!