Ganesh Immersion 2025( image CREDIT: TWITTER)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Ganesh Immersion 2025: గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.. వంద ప్రాంతాల్లో నిమజ్జనం.. 404 క్రేన్ల వినియోగం

Ganesh Immersion 2025: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల నుంచి ఘనంగా పూజలందుకుంటున్న వినాయకుడి విగ్రహాలకు ఫైనల్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. సిటీ పోలీసు, జీహెచ్ఎంసీ,(GHMC,) హెచ్ఎండీఏ, రోడ్ల, భవనాలు, పర్యాటక శాఖ ఇతర శాఖల సమష్టి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. గత నెల 27వ తేదీ ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు మూడు, అయిదు, ఏడు, తొమ్మిది, పది రోజుల్లో ఒక్క హుస్సేన్ సాగర్ చుట్టూ సుమారు లక్షా 25 వేల విగ్రహాలు నిమగ్నం కాగా, శనివారం జరగనున్న ఫైనల్ నిమజ్జనం రోజున మరో 50 వేల విగ్రహాలతో పాటు సిటీలో పేరుగాంచిన ఖైరతాబాద్,(Khairatabad) బాలాపూర్ గణనాధుల నిమజ్జనాల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

 Also Read: Nag Ashwin: న్యూ జీఎస్టీ రూల్స్.. సినిమా టికెట్ల ధరలపై ప్రధానికి నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

35 వేల మంది పోలీసులు

గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనర్నేట్ల పరిధితో పాటు మొత్తం 35 వేల మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ లోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సాయుధ బలగాలను మోహరించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణపయ్యను ఉదయం ఆరు గంటలకే నిమిజ్జనం నిమిత్తం హుస్సేన్ సాగర్ వైపు కదిలేలా పోలీసులు, మండప నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ వినాయకుడ్ని నిమజ్జనానికి తరలించేందుకు విజయవాడ నుంచి భారీ టస్కర్ వాహానాన్ని రప్పించారు. వినాయకుడు టస్కర్ పై పెట్టి తీసుకువెళ్లేలా టస్కర్ కు వెల్డింగ్ పనులను కూడా శుక్రవారం మధ్యాహ్నానికే పూర్తి చేశారు. ఎన్టీఆర్ మార్గ్ లోని బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేయనున్నారు.

పోలీసుల వ్యూహాం సిద్దం

ఇక బాలాపూర్(*Balapur) నుంచి హుస్సేన్ సాగర్ వరకు 21 కిలోమీటర్ల పొడువున ఉన్న శోభయాత్రకు పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలితో పాటు వివిధ విభాగాల అధికారులు ఇప్పటికే పలు సార్లు నేరుగా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో బాలాపూర్ వినాయకుడ్ని మధ్యాహ్నాం ఒంటి గంట కన్నా ముందు చార్మినార్ దాటించి, సాయంతం నాలుగు గంటల కల్లా నిమజ్జనం జరిగేలా పోలీసులు వ్యూహాం సిద్దం చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం మాధిరిగానే ఈ సారి కూడా ఖైరతాబాద్ గణపయ్యను మధ్యాహ్నాం ఒంటి గంట కల్లా ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

బాలాపూర్, ఖైరతాబాద్ గణనాధుల నిమజ్జనం వీలైనంత త్వరగా పూర్తయితే, దాదాపు సిటీలో నిమజ్జనం ప్రక్రియ శాంతియుతంగా ముగిసినట్టేనని పోలీసులు భావిస్తున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు సుమారు 21 కిలోమీటర్ల శోభయాత్ర రూట్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ వైపు వచ్చే మరో సుమారు 303 కిలోమీటర్ల శోభాయాత్ర రూట్ లో ఎప్పటికపుడు నిమజ్జన చెత్తను తొలగించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. వివిధ రూట్లలో 14 వేల 475 మంది పారిశుద్ధ్య కార్మికులను మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేశారు.

జీహెచ్ఎంసీ కృత్రిమ కొలనులు

గణేష్ ప్రతిమల నిమజ్జన కార్యక్రమం సురక్షితం, సాఫీగా, వేగంగా జరిగేలా చూసేందుకు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74 కృత్రిమ నిమజ్జన కొలనులను ఏర్పాటు చేసింది. వీటిల్లో చిన్న చిన్న విగ్రహాలతో పాటు ఈ సారి ఎనిమిది అడుగుల ఎత్తున్న విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ప్రతి నిమజ్జన పాండ్ వద్ద ఒక ఇంచార్జ్ అధికారి, సర్కిల్ కు నోడల్ అధికారి తో పాటు ఓవరాల్ ఇంచార్జ్ గా సంబంధిత డిప్యూటీ కమిషనర్, శానిటేషన్ సిబ్బంది సరిపోను క్రేన్లు, కంట్రోల్ రూమ్, మెడికల్ క్యాంపు, ఎప్పటి కప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు శానిటేషన్ సిబ్బంది తో పాటుగా వాహనాలను ఏర్పాటు చేసి సాఫీగా నిమజ్జనం జరిగేలా  సిబ్బంది మూడు షిఫ్ట్ లలో పని చేసేలా కార్మికులను నియమించారు. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, ఐడిఎల్ చెరువు, సఫిల్‌గూడ చెరువు, సున్నం చెరువు సహా 20 ప్రధాన చెరువులతో పాటు ఈ 74 కృత్రిమ కుంటలలో నిమజ్జనం జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. తద్వారా ప్రధాన చెరువుల పై ఒత్తిడి తగ్గించడం, ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేయడమే గాక, సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సమీపంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కు ప్రజల సౌకర్యం కోసం విసృతంగా  కృత్రిమ నిమజ్జన పాండ్ లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది.

శాశ్వత బేబీ పాండ్లు

ఒక అడుగు నుంచి అయిదు అడుగుల ఎత్తు ఉన్న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ పలు ప్రాంతాల్లో శాశ్వత బేబీ పాండ్లను ఏర్పాటు చేసింది. జోన్ల వారీగా వీటి వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని చర్లపల్లి చెరువు, కాప్రా చెరువు, నల్ల చెరువు, నాగోల్ చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువు బీబీ పాండ్లను ఏర్పాటు చేశారు. అలాగే చార్మినార్ జోన్ పరిధిలోని పాటి కుంట, రాజన్న బావి, ఖైరతాబాద్ జోన్ లోని నెక్నాంపూర్, నెక్లెస్ రోడ్, దుర్గం చెరువు, మల్కం చెరువు, నల్లగండ్ల చెరువు, గోపి చెరువు, శేరిలింగంపల్లి జోన్ లోని గంగారం చెరువు, కైదమ్మ కుంట,గురునాథం చెరువు, రాయ సముద్రం ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా, కూకట్ పల్లి జోన్ లోని ముళ్లకత్వ చెరువు, ఐడీఎల్ బేబీ పాండ్, బాలాజీ నగర్, మూసాపేట్, బోయిన్ చెరువు బేబీ పాండ్, ప్రగతి నగర్ బేబీ పాండ్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, వెన్నెల గడ్డ చెరువు, లింగం చెరువు, సురారం (మైసమ్మ దేవాలయం పక్కన), కొత్త చెరువు, అల్వాల్ దేవాలయం, సికింద్రాబాద్ జోన్ లోని సంజీవయ్య పార్క్, సఫిల్‌గూడ, బండ చెరువుల వద్ద బేబీ పాండ్లలో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.

ఎప్పటికపుడు పర్యవేక్షణ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం జరగనున్న గణేష్ నిమజ్జనాన్ని మూడు కమిష్నరేట్ల పరిధిలో పోలీసులు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ క్షేత్ర స్థాయిలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీసులు, జీహెచ్ఎంసీలోని కమాండ్ కట్రోల్ ద్వారా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్ లు నిమజ్జనం జరుగుతున్న తీరును సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికపుడు సూచనలు జారీ చేయనున్నారు. దీంతో పాటు డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ఏరియల్ సర్వే నిర్వహించి నిమజ్జనం సజావుగా జరిగేలా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు.

11 వేల 442 గుంతల పూడ్చివేత

మహానగరంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ రోడ్ సేఫ్టీ కార్యక్రమం కింద ఆరు జోన్లలోని మొత్తం 11 వేల 442 గుంతలను పూడ్చి వేసింది. అంతలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు రావటంతో గుంతలను పూడ్చే ప్రక్రియను జీహెచ్ఎంసీ ముమ్మర చేసింది. నిమజ్జనం కోసం గణనాధులను తరలించే వాహానాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా గుంతలను పూడ్చినట్లు అధికారులు వెల్లడించారు.
—————————————————————————————————————–
జోన్ గుర్తించిన గుంతలు పూడ్చిన గుంతలు
————————————————————————————————————–
ఎల్బీనగర్ 2977 2509
చార్మినార్ 2339 1940
ఖైరతాబాద్ 1888 1520
శేరిలింగంపల్లి 1938 1303
కూకట్ పల్లి 2074 1837
సికిందరాబాద్ 2834 2333
————————————————————————————————
మొత్తం 14050 11442
—————————————————————-

 Also Read: Ganesh Immersion: గణేష్ నిమజ్జనం ఊరేగింపులకు మీరు వెళ్తున్నారా.. అయితే బీకేర్ ఫుల్!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం