Nag Ashwin: దేశంలోని సామాన్య ప్రజానీకంపై ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం.. రీసెంట్‌గా జీఎస్టీ శ్లాబులను నాలుగు నుంచి రెండుకు కుదించిన విషయం తెలిసిందే. నూతన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో, వినోదరంగంలో ప్రధానమైన సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు ప్రభావితం కాబోతున్నాయి. జీఎస్టీ రేట్ల సవరణతో సినిమా టికెట్ల నుంచి పాప్‌కార్న్ టబ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్ రేట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో జీఎస్టీ కౌన్సిల్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి. రూ.100 లోపు సినిమా టికెట్లపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంతో చిన్న సినిమాల నిర్మాతలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రూ. 100 కంటే ఎక్కువ టికెట్ ధర ఉంటే మాత్రం ఎప్పటిలానే 18 శాతం జీఎస్టీ రేటు అమలు అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయంపైనే దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin).. దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)కి ఓ రిక్వెస్ట్ చేశారు. అదేంటంటే..
Also Read- Allu Arjun: మొత్తానికి మరోసారి మల్లు అర్జున్ అనిపించుకున్నాడుగా!
నాగ్ అశ్విన్ విన్నపమిదే..
‘‘జీఎస్టీ సంస్కరణలు స్వాగతించదగినవి. దయచేసి రూ. 250 వరకు ఉన్న సినిమా టిక్కెట్‌లకు కూడా 5 శాతం జీఎస్‌టీని వర్తింపజేస్తే బాగుంటుంది. ఈ రోజుల్లో రూ. 100 సినిమా టికెట్లు ఉన్న థియేటర్లు చాలా తక్కువగా ఉన్నాయి. చిత్ర పరిశ్రమ, థియేటర్లు వృద్ధి చెందడానికి, అలాగే మధ్యతరగతి ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇది చాలా అవసరం..’’ అని ప్రధాని మోదీకి ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) దర్శకుడు నాగ్ అశ్విన్ విన్నవించుకున్నారు. మరి ఆయన విన్నపం మోదీ వరకు చేరుతుందో, లేదో వేచి చూడాల్సి ఉంది. వాస్తవానికి నాగ్ అశ్విన్ విన్నపం చాలా సమంజసమైనదిగా చెప్పుకోవాలి.
The gst reforms are very welcome sir. It would be great if the 5% slab can be extended to movie tickets upto 250rs atleast… Very few theaters nowadays are at 100rs and for our industry and theatres to grow and keep the middle class audience coming this is very needed sir. 🙏
— Nag Ashwin (@nagashwin7) September 5, 2025
సమంజసమైన విన్నపమే..
ప్రజంట్ ఇండియన్ సినిమావైపు అన్ని సినిమా ఇండస్ట్రీలు చూస్తున్నాయి. క్వాలిటీ విషయంలో మన దర్శకనిర్మాతలు హాలీవుడ్‌ని మరిపించేలా సినిమాలు చేస్తున్నారు. కానీ, థియేటర్లలో ఆ సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ సాధించలేక పోతున్నాయి. భారీ బడ్జెట్‌తో సినిమాలు చేసే నిర్మాతలకు డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం, ఓటీటీ ప్రభావం అన్నీ కలగలిపి ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడమే. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా రూ. 250 వరకు జీఎస్టీ సవరణ చేస్తే మాత్రం సామాన్యులకు కూడా టికెట్ ధరలు అందుబాటులోకి వస్తాయనేది కాదనలేని వాస్తవం. ఇదే విషయాన్ని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి ఈ ట్వీట్‌ని మోదీని చేరాలని అంతా కోరుకుంటున్నారు.
Also Read- Watch: ఎడమ చేయి మంచిది కాదంటారు.. కానీ, వాచ్ మాత్రం పెట్టుకుంటారు.. ఎందుకో తెలుసా?
‘కల్కి 2898 AD’ కోసం కసరత్తులు
రెబల్ స్టార్ ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ చేసిన ‘కల్కి 2898 AD’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంది. ఇప్పుడీ సినిమా సీక్వెల్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. కానీ పార్ట్ 2కి సంబంధించి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని, ఇటీవల నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’, ‘ఫౌజి’ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన తర్వాతే ‘కల్కి 2898 AD’ సెట్స్‌పైకి రానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు