Allu Arjun: ‘పుష్ప’ (Pushpa) సిరీస్ చిత్రాలతో ప్రపంచం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసిన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun). ‘పుష్పరాజ్’గా అల్లు అర్జున్ నటనకు ప్రపంచం దాసోహమైంది. ప్రతి ఒక్కరూ గడ్డం కింద చేయి పెట్టి ‘తగ్గేదే లే’ అన్నవారే కానీ, అనని వారు లేరంటే అతిశయోక్తి లేనే లేదు. అంతగా ఆ సినిమా అల్లు అర్జున్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. అంతేకాదు, టాలీవుడ్ హిస్టరీలో ఇప్పటి వరకు లేనిది బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఏ ముహూర్తాన ఈ సినిమాకు అల్లు అర్జున్ సైన్ చేశాడో గానీ, ఒక్కసారిగా తన ఫేట్‌నే మార్చిసిందీ చిత్రం. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్‌కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది కానీ, అంతకంటే ముందే ఆయనలోని గొప్ప నటుడిని గుర్తించి అడాప్ట్ చేసుకున్నారు మలయాళ ప్రేక్షకులు. ఆయన సినిమాలు అక్కడి స్ట్రయిట్ సినిమాలకు పోటీగా సక్సెస్ సాధిస్తాయంటే.. అల్లు అర్జున్‌కు మలయాళంలో ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మీ దత్త పుత్రుడు
అందుకే అక్కడి ప్రేక్షకులు ప్రేమగా అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్ (Mallu Arjun)గా పిలుచుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్ కూడా మలయాళీ ప్రేక్షకుల పిలుపుకు ఫిదా అవుతూ.. అక్కడ వరకు తన పేరును మల్లు అర్జున్‌గానే ఫిక్స్ అయిపోతుంటాడు. తాజాగా ఆయన తన మలయాళ అభిమానులపై మరోసారి ప్రేమను కురిపించి, మల్లు అర్జున్‌గా తనని దత్తత తీసుకున్న ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. మలయాళీ ఫెస్టివల్ ‘ఓనం’ స్పెషల్‌గా, అక్కడి ప్రేక్షకులకు, ప్రజలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా మలయాళీ సోదరులకు ఇవే నా హృదయపూర్వక ‘ఓనం’ శుభాకాంక్షలు. ఈ పండగ మీ జీవితంలో సంపద, శాంతి, శ్రేయస్సును నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండుగ నూతన ఆరంభానికి నాంది పలకాలని ఆశిస్తూ.. మీ దత్త పుత్రుడు’’ అని అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు మలయాళీ ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అవుతున్నారు. అన్నా.. నువ్వు మావోడివి వన్నా.. అంటూ అభిమానం చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read- Niharika Konidela: సారీ అమ్మా! అంటూ నిహారిక పోస్ట్.. అల్లు శిరీష్ కామెంట్ వైరల్!
అట్లీతో గ్లోబల్ ఫిల్మ్
‘పుష్ప’ సిరీస్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడా? అని అంతా ఎంతగానో ఎదురు చూశారు. వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆయన సినిమా అంటూ అధికారిక ప్రకటన వచ్చి కూడా ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ ఖాతాలోకి పోగా, ఇప్పుడు అల్లు అర్జున్ అదే ప్లేస్‌లో తమిళ దర్శకుడు అట్లీతో తన 22వ (AA22 Film) సినిమాకు ఓకే చెప్పడం, తర్వాత వచ్చిన వీడియోలు అన్నీ కూడా.. ఈసారి అభిమానులకు అల్లు అర్జున్ గ్లోబల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని తెలియజేశాయి. సైన్స్ ఫిక్షన్ మూవీగా అల్లు అర్జున్, అట్లీ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాను కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
Heartfelt Onam wishes to all Malayalis!
May this Onam mark a new beginning filled with prosperity and peace. 🤍🙏🏽
Your adopted son pic.twitter.com/c1EIxyc76S— Allu Arjun (@alluarjun) September 5, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు