Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇన్‌స్టాగ్రమ్ వేదికగా చేసిన ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు కేవలం.. ‘సారీ అమ్మా’ అని మాత్రమే క్యాప్షన్ జోడించింది. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్‌లో ఆమె చేసిన వీడియోలో కొండ ప్రాంతంలో ఓ వాటర్ ఫాల్ దగ్గర ఉండటంతో.. ఓ అడ్వంచర్ ట్రిప్‌లో (Niharika Adventure Trip) ఆమె ఉన్నట్లుగా అంతా భావిస్తున్నారు. ఆమె షేర్ చేసిన వీడియోలో జలపాతాన్ని చూస్తుంటే కొంచెం భయానకంగానే ఉంది. రాళ్లను దాటుకుంటూ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లబోతూ.. కింద కూడా పడబోయింది నిహారిక. ఇలాంటి అడ్వంచర్ అవసరమా? అని కూడా ఫ్యాన్స్ కొందరు ఈ వీడియోకు రియాక్ట్ అవుతుండటం విశేషం. మరి ఈ వీడియోకు ఆమె ‘సారీ అమ్మా’ (Sorry Amma) అని ఎందుకు పెట్టిందని అనుకుంటున్నారు కదా.. ఆ విషయంలోకి వస్తే..
Also Read- Allu Arjun and Anushka: ‘పుష్ప’ యూనివర్స్‌లో ‘ఘాటి’ కూడా భాగమా?.. పుష్పరాజ్‌తో షీలావతి!
సారీ అమ్మా అని పెట్టడానికి కారణమిదే..
నిహారిక ఈ వీడియోకు ‘సారీ అమ్మా’ అని పెట్టడానికి కారణం ఏంటంటే.. ‘‘నేను ఎప్పుడు ఇలాంటి ట్రిప్పులకు వెళ్లినా, నా కుమార్తె క్షేమంగా తిరిగి రావాలని మా అమ్మ ఇంట్లో పూజలు చేస్తూ ఉంటుంది. నేను మాత్రం అవేం పట్టించుకోకుండా ఇలాంటి ట్రిప్స్‌కు వెళుతూనే ఉంటాను’’ అని నిహారిక పేర్కొంది. నిజమే మరి.. ఏ తల్లి అయినా అదే కోరుకుంటుంది. బిడ్డలు క్షేమంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు. అందులో నిహారిక వంటి హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ల విషయంలో.. తల్లి కంగారు పడటంలో తప్పేముంది. నిహారిక పోస్ట్‌కు నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ‘అమ్మ ఎప్పుడు మన క్షేమమే కోరుకుంటారు, అమ్మ ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడు ఉంటాయి, టేక్ కేర్ నిహారిక’ అంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ బాగా వైరల్ అవుతోంది.
Also Read- Upasana Konidela: సాయిబాబా వ్రతం పూర్తి చేసిన ఉపాసన, చివరి రోజు ఆమె చేసిన పనికి అంతా ఫిదా!
లావణ్య త్రిపాఠి, అల్లు శిరీష్ కామెంట్
ఇక నిహారిక చేసిన ఈ పోస్ట్‌కు తన వదిన, నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఓ ఎమోజీని కామెంట్ చేస్తే.. అల్లు శిరీష్ (Allu Sirish) మాత్రం ‘గుడ్.. పిన్ని పూజలు పని చేస్తున్నాయన్న మాట’ అని కామెంట్ చేశారు. ఈ కామెంట్‌కు నెటిజన్లు రకరకాలుగా రిప్లైలు ఇస్తుండటం విశేషం. మొత్తంగా అయితే, విడాకుల తర్వాత మెగా డాటర్ సాహసనారిగా మారిందని, అంతా అనుకుంటూ ఉండటం విశేషం. అలాగే నిహారిక తన లైఫ్‌ని చక్కగా ఎంజాయ్ చేస్తుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాతగా సక్సెస్
హీరోయిన్‌గా తన సత్తా చాటాలని వచ్చిన నిహారికకు నిరాశే ఎదురైంది. హీరోయిన్‌గా తను చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయం సాధించలేదు. కానీ నిర్మాతగా మాత్రం ఆమె ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇటీవల ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా పెద్ద సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో వైపు మంచు మనోజ్ హీరోగా, నిహారిక హీరోయిన్‌గా ‘వాట్ ద ఫిష్’ అనే సినిమా అనౌన్స్ అయిన కొన్ని రోజులకే ఆగిపోయింది. మళ్లీ ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని మంచు మనోజ్ చెబుతున్నారు. మరి అందులో నిహారిక ఉంటుందో, లేదంటే వేరే హీరోయిన్ వస్తుందో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు