upasana sai baba vrat
ఎంటర్‌టైన్మెంట్

Upasana Konidela: సాయిబాబా వ్రతం పూర్తి చేసిన ఉపాసన, చివరి రోజు ఆమె చేసిన పనికి అంతా ఫిదా!

Upasana Konidela: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఆసుపత్రుల వైస్‌ ఛైర్‌ పర్సన్ ఉపాసన కొణిదెల (Upasana Konidela) మరోసారి వార్తలలో నిలిచారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సాయిబాబాను తను కొలుస్తానని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసినట్లుగా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గురు పౌర్ణిమి రోజు మొదలైన ఆమె వ్రతం.. సెప్టెంబర్ 4తో పూర్తయిందని తెలుపుతూ.. ఈ సందర్భంగా షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకోనున్నట్లుగా ఆమె ప్రకటించారు.

Also Read- Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బిగ్ ట్విస్ట్?.. సీటుపై కన్నేసిన ఓ ఎమ్మెల్యే

ఈ క్రమంలో ఆమె చేసిన పోస్ట్‌లో.. ‘‘గురు పౌర్ణిమి రోజు ప్రారంభమైన సాయిబాబా వ్రతం 9 వారాల జర్నీతో శాంతిగా ఎంతో నమ్మకంతో నడిచింది. నా సోదరితో కలిసి నేను ఈ వ్రతాన్ని మొదలు పెట్టాను. ఈ వ్రతంతో నేను కోరుకున్న దాని కంటే ఎక్కువగా నాకు బాబా ఆశీస్సులు లభించాయి. నన్ను సదా రక్షిస్తున్న ఆ సాయినాథునికి ధన్యవాదాలు. నా లైఫ్ టైమ్‌లో వీలైనంత ఎక్కువమందికి సేవ చేస్తానని ఈ వ్రత దీక్షలో బాబాను ప్రార్థించాను. అత్తమ్మాస్ కిచెన్‌ వినియోగదారులకు మీల్స్‌ అందిస్తాము.. జై సాయిరామ్‌’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్‌కు అందరూ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.

945 మందికి భోజనాలు

ఉపాసన తన సోదరితో కలిసి 9 వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా, ‘అత్తమ్మాస్ కిచెన్’ 105 వ్రత కిట్‌లను విక్రయించింది. దీని ద్వారా వచ్చిన అమౌంట్‌తో చివరి రోజున సేవగా 945 మందికి భోజనాలను అందించారని తెలుస్తోంది. వ్రతంలో భాగంగా చివరి రోజున ఆమె చేసిన సేవకు గానూ అంతా ఫిదా అవుతున్నారు. మెగా కోడలిగా మరో మెట్టు ఎక్కేశారు అంటూ మెగా ఫ్యాన్స్ ఆమెను కొనియాడుతున్నారు.

Also Read- Ganesh immersion: గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే

వ్రతంలో ఉండగానే పదవి

ఈ వ్రతంతో నేను కోరుకున్న దాని కంటే ఎక్కువగా నాకు బాబా ఆశీస్సులు లభించాయని ఉపాసన అనడంతో.. నిజంగానే ఆమెకు వ్రత ఫలితం దక్కినట్లుగా అంతా భావిస్తున్నారు. ఆమె వ్రతం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే.. తెలంగాణ ప్రభుత్వం ఆమెను పిలిచి మరీ పదవి అప్పగించారు. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ (Sports Hub of Telangana)కు ఆమె కో ఛైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు ఈ బాధ్యతను అప్పగించారు. దీంతో అందరూ ఈ వ్రతం గురించి సెర్చ్ చేస్తుండటం విశేషం. కొందరు కామెంట్స్ రూపంలో ఈ వ్రతం ఎలా చేయాలో మాకు కూడా చెప్పండి ఉపాసన మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం