Ganesh-immersion
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Ganesh immersion: గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే

Ganesh immersion: తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం (Ganesh immersion) అత్యంత అంగరంగవైభవంగా జరుగుతుంది. వేలాది గణపయ్య విగ్రహాలు ఊరేగింపు తరలి వెళ్లి గంగమ్మ ఒడిలోకి చేరుతాయి. ఆధ్యాత్మికంగా అత్యంత కీలకమైన ఈ ఘట్టం సజావుగా సాగేందుకు నగరంలో ఆంక్షలు విధించడం అనివార్యం అవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పోలీసులు హైదరాబాద్ నగరానికి సంబంధించిన నిమజ్జన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ పరిమితులు విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఏయే రూట్లలో శోభాయాత్రలు..

బాలాపూర్ నుంచి చార్మినార్–అబిడ్స్–లిబర్టీ–ట్యాంక్‌బండ్–నెక్లెస్ రోడ్ మార్గంలో ప్రధాన శోభాయాత్ర జరుగుతుంది. సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ–ప్యారడైజ్–రాణిగంజ్–కర్బలామైదాన్–ట్యాంక్‌బండ్ రెండవ మార్గంగా ఉంది. దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి వచ్చే ఊరేగింపులు లిబర్టీ వద్ద కలుస్తాయి. టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరతాయి. తపాచపుత్ర, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే గణేశుడు విగ్రహాలు ఎంజే మార్కెట్‌ వద్ద కలుస్తాయి. ఈ ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి ఉండదు.

Read Also- Allu Arjun and Anushka: ‘పుష్ప’ యూనివర్స్‌లో ‘ఘాటి’ కూడా భాగమా?.. పుష్పరాజ్‌తో షీలావతి!

డైవర్షన్ పాయింట్లు ఇవే..

సౌత్‌ఈస్ట్ జోన్ డైవర్షన్ పాయింట్లు: కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడగా ఉన్నాయి. ఇక, సౌత్ జోన్: అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుశ్షిఫా, ఈస్ట్ జోన్: శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, వైఎంసీఏ, సెంట్రల్ జోన్: లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బుద్ధభవన్, నార్త్ జోన్: ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్‌ అని అధికారులు వెల్లడించారు. ఇక పార్కింగ్ ప్రదేశాల విషయానికి వస్తే, ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ పేర్లను అధికారులు వెల్లడించారు.

లారీలు, బస్సులకు పరిమితులు

మరోవైపు, నిమజ్జనం తర్వాత లారీలు నగరంలోకి ప్రవేశించకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే ట్రాఫిక్ అధికారులు అనుమతిస్తారు. సెప్టెంబర్ 6 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీలకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు బాగా రద్దీ ఉన్న సమయంలో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే ప్రవేశ అనుమతి ఉంటుంది. అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్‌ఘాట్ వైపునకు మాత్రమే దారి మళ్లించనున్నారు.

Read Also- Bathukamma Sarees: బతుకమ్మ చీరలు వచ్చేస్తున్నాయ్.. హైదరాబాద్‌లో ఎన్ని పంచుతారంటే?
ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వైపు బస్సులు వెళ్లడానికి వీలుండదు. కాగా, విమానాశ్రయం వైపు వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు బేగంపేట్–ప్యారడైజ్ మార్గంలో చేరుకోవాలి. నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు (కృత్రిమ చెరువులు), 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు ఏర్పాటు చేశారు. ఏదైనా సమాచారం కావాల్సిన వారు 040-27852482, 8712660600, 9010203626 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం