Allu Arjun and Anushka: రీసెంట్‌గా రానా దగ్గుబాటి (Rana Daggubati), స్వీటీ అనుష్క (Anushka)ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ (Ghaati) చిత్రం సెప్టెంబర్ 5న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అనుష్క డైరెక్ట్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొనకపోయినప్పటికీ, సినిమా కోసం అంతకంటే ఎక్కువే చేస్తుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు అనుష్క తన వంతుగా తన పరిచయాలను ప్రమోషన్స్‌కు వాడుతోంది. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)తో అనుష్క మాత్రమే కాదు, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ (Allu Arjun) వంటి హీరోలు కూడా సినిమాలు చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’ సినిమాలో అల్లు అర్జున్, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకా గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాలోనూ వీరిద్దరూ కలిసి నటించారు. ‘రుద్రమదేవి’ సినిమాలో రానా కూడా భాగమయ్యారు. ‘బాహుబలి’ సినిమాలో రానా, అనుష్క నటించిన విషయం తెలిసిందే. అలా వీరంతా ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉంటున్నారు. ఆ స్నేహాన్ని ఇప్పుడు అనుష్క తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటోంది.
అల్లు అర్జున్‌తో ఫోన్ సంభాషణ
రీసెంట్‌గా రానాతో ఫోన్‌లో సంభాషించి చిత్ర ప్రమోషన్స్ చేసుకున్న అనుష్క.. తాజాగా పుష్పరాజ్ అల్లు అర్జున్‌తో సంభాషించారు. చిత్ర వివరాలను బన్నీకి తెలిపారు. అంతేకాదు, ఈ సినిమాకున్న లీడ్.. ‘పుష్ప’ యూనివర్స్‌కు యూజ్ అవుతుందనేలా వారిద్దరూ మాట్లాడుకోవడం విశేషం. సరోజ, రుద్రమదేవి, ఇప్పుడు షీలావతి.. చాలా లాంగ్ జర్నీ కదా మనిద్దరిదీ అని అల్లు అర్జున్ అంటే, నేను చేసిన మొమరబుల్ పాత్రలలో నువ్వు కూడా భాగమయ్యావు కదా.. అని అనుష్క అన్నారు. నేను ఏ మూవీ చేసినా, వెంటనే కాల్ చేసి, ఎంతగానో ప్రశంసిస్తూ ఉంటావు.. అని అనుష్క అంటే.. నువ్వు చేసే సినిమాలు అంత గొప్పగా ఉంటాయి కాబట్టి.. వాటికి నువ్వు అర్హురాలివి అని అల్లు అర్జున్ అన్నారు.
Also Read- Tunnel Telugu Trailer: అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠిల ‘టన్నెల్’ ట్రైలర్ ఎలా ఉందంటే?
భార్యభర్తల్లో మార్పు
‘పుష్ప’ తర్వాత నేను నీకో విషయం చెప్పాలి అనుకున్నాను. ఆ సినిమా తర్వాత అందరూ భర్తలలో చాలా మార్పు వచ్చింది. అందరూ వారి భార్యలను పుష్పరాజ్ చూసుకున్నంత ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టారు. ఎవరైనా లైఫ్‌లో అప్సెట్ అయితే.. వెంటనే వాళ్లు పుష్పరాజ్‌లాగా మారిపోతున్నారు. అలా నువ్వు మార్చేశావ్.. అందరూ నిన్ను ఫాలో అవుతున్నారు. నేను చెప్పడం అని కాదు కానీ, ఆ సినిమాలో అంత గొప్పగా భార్యభర్తల బంధాన్ని చూపించారు.. అని అనుష్క అంటే.. అమ్మాయిలను ప్రేమగా చూసుకుంటే మంచిదే కదా. థ్యాంక్యూ ఈ మార్పు వచ్చిందని చెప్పినందుకు అని బన్నీ అన్నారు.
శీలావతి:
వాళ్లు ఊరుకోరు..వీళ్లు ఊరుకోరు అంటే.. నేను ఊరుకోను
పుష్ప రాజ్ :
తగ్గేదే లే 🔥What a magnificent display of camaraderie n grace from ‘Icon Star’ @alluarjun garu. An immensely heartfelt thank u for ur wonderful call to ‘The Queen’ @MsAnushkaShetty ahead of #Ghaati‘s… pic.twitter.com/IfPf8ebSkJ
— Krish Jagarlamudi (@DirKrish) September 4, 2025
ఈ జనరేషన్‌కే టాప్
క్రిష్ సరోజ పాత్రతో నన్ను చాలా కొత్తగా చూపించారు. ఇప్పుడు షీలావతి పాత్రకు కూడా యాక్షన్‌తో పాటు అనేక షేడ్స్ ఉంటాయి. అంత గొప్పగా ఆ పాత్రను తీర్చిదిద్దారు.. అని అనుష్క అంటే.. అసలు ఈ జనరేషన్‌లో లేడీగా అంత యాక్షన్ చేసేది నువ్వే అనుకుంటా. ఏ సినిమా అయినా సరే.. ఆల్మోస్ట్ హీరో చేసేంత యాక్షన్ చేస్తావు నువ్వు. బాహుబలి, రుద్రమదేవి, అరుంధతి, భాగమతి.. ఇప్పుడు షీలావతి.. అన్నీ హై ఇచ్చే సినిమాలే అని అల్లు అర్జున్ అన్నారు.
Also Read- Coolie OTT: అఫీషీయల్.. ‘కూలీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..
పుష్ప, షీలావతి ‘రా యూనివర్స్’
నేను ఈ సినిమా గురించి విన్నది కరక్టేనా.. షీలావతి పాత్రకు, పుష్పకు మధ్య క్రాస్ ఓవర్ ఉంటుందట కదా.. అని బన్నీ ప్రశ్నిస్తే.. నేను కూడా ఓ ఇంటర్వ్యూలోనే ఈ మాట విన్నానని అనుష్క చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ‘రా యూనివర్స్’లా ఉంటుందని అనుకుంటున్నా. ప్లీజ్ సుకుమార్‌కు చెప్పరా? అని చెప్పాను అని అనుష్క అన్నారు. పుష్ప, షీలావతి కలిస్తే.. ఎవరు డైరెక్ట్ చేయాలి? క్రిష్ లేదంటే సుకుమారా? అని అల్లు అర్జున్ అంటూ.. ఓ పని చేద్దాం.. రెండు పార్టులు చేసి చెరో పార్ట్ డైరెక్ట్ చేయమని చెబుదామని బన్నీనే ఆన్సర్ ఇచ్చారు. నాకు కూడా నిజమే అనిపించింది. ఇలా రా యూనివర్స్ ఒకటి క్రియేట్ చేసి.. మన పాత్రలన్నీ ఇలా కలిస్తే.. పాన్ ఇండియా కూడా బద్దలవుతుంది అని అనుష్క అంటే.. కచ్చితంగా చేద్దామని బన్నీ అన్నారు. ఇలా వారిద్దరి మధ్య చాలా సరదాగా సంభాషణ నడిచింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనికి నిజమే.. పుష్ప గంధపు చెక్కలు, షీలావతి గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు కాబట్టి.. వారిద్దరి పాత్రలను కలిపేయడం ఈజీనే అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి, ఈ దిశగా ఆ దర్శకులు ఏమైనా ప్రయత్నిస్తారేమో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు