Coolie OTT: అఫీషీయల్.. ‘కూలీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..
Coolie Movie Poster
ఎంటర్‌టైన్‌మెంట్

Coolie OTT: అఫీషీయల్.. ‘కూలీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

Coolie OTT: సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ (Coolie). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ఫస్ట్ టైమ్ ఇందులో విలన్ పాత్రను చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఓటీటీకి విడుదలకు సంబంధించి రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ వార్తలన్నింటికీ బ్రేక్ వేస్తూ.. అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది.

Also Read- Viral Wedding Video: మనవరాలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.. ఆమె పుట్టినప్పుడే ప్రేమలో పడ్డా?

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సంస్థ.. ‘కూలీ’ ప్రీమియర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ‘కూలీ’ చిత్రం సెప్టెంబర్ 11 నుంచి తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషలలో అందుబాటులోకి రానుంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 240 దేశాలలో ప్రైమ్ వీడియో ఈ సినిమాను ప్రత్యేకంగా స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి ఇంకా టైమ్ తీసుకునేదే. కాకపోతే మద్రాస్ హైకోర్టు నిర్మాణ సంస్థ సెన్సార్ సర్టిఫికెట్‌పై వేసిన కేసును కొట్టి వేయడంతో.. 4 వారాల గ్యాప్‌లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ఇవ్వడంపై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. సినిమా విడుదల తర్వాత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కానీ, సెన్సార్ బోర్డు వివరణ అనంతరం, ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఇన్‌వాల్వ్ కాలేమని ప్రకటించింది. దీంతో నిరాశ చెందిన సన్ పిక్చర్స్ నిర్మాత.. ప్రైమ్ వీడియోతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అనుకున్న డేట్‌కే సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఓకే చెప్పారు.

Also Read- PM Condolence Message: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన అల్లు అరవింద్.. ఎందుకంటే?

థియేటర్లలో ఫెయిల్

భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి టాక్‌నే సొంతం చేసుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం నిర్మాతను డిజప్పాయింటే చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా రాబట్టినా, ఇంకా కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ దాదాపు రూ. 300 కోట్ల వరకూ ఉండటం విశేషం. దీంతో ఈ సినిమాను అంతా ఫెయిల్యూర్ సినిమాగానే భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌పై నిర్మాత కోర్టుకు వెళ్లారు. కోర్టులో కనుక ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను యుబైఏ‌గా మారిస్తే.. థియేట్రికల్ రైట్స్ కాకుండా ఇతర రైట్స్ రూపంలో ఈ సినిమా నిర్మాత సేఫ్ జోన్‌లోకి వెళ్లొచ్చని భావించారు. కానీ ఆయన ఆశలపై కోర్టు నీళ్లు చల్లేసింది.

కథ ఇదే..

విశాఖపట్నం రేవుల నేపథ్యములో ఈ ‘కూలీ’ సినిమాను లోకేష్ కనగరాజ్ సెట్ చేశారు. ఒక మాజీ కూలీ అయిన దేవ.. తన ప్రాణ స్నేహితుడి అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తుండగా.. ఒక స్మగ్లింగ్ సిండికేట్‌కు లింక్ ఉన్నట్లుగా తెలుస్తుంది. రహస్య ఎలెక్ట్రిక్ కుర్చీ, భూస్థాపితం చేయబడిన నిజాలు, వీటికి వెనుక దాగి ఉన్న ఒక ద్రోహిని కనుక్కోవడం కోసం దేవ ఏం చేశాడు. న్యాయం కోసం పోరాటం చేసే క్రమంలో తన గతానికి సంబంధించిన జ్ఞాపకాలతో ఈ స్టోరీ ముడిపడి ఉంటుంది. అదేంటి? ఫైనల్‌గా తన స్నేహితుడి మరణానికి కారణమైన వారిని దేవ కనుక్కున్నాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘కూలీ’ సినిమా.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?