Viral Wedding Video
Viral

Viral Wedding Video: మనవరాలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.. ఆమె పుట్టినప్పుడే ప్రేమలో పడ్డా?

Grand father Marries Grand daughter: ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కాకుండా ఉంది. వావి-వరసలు, బంధాల తేడా లేకుండా ప్రేమ వ్యవహారాలు, వివాహాలు జరుగుతున్న సంఘటనలు టీవీల్లో, సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నాయి. తాజాగా, ఓ 70 ఏళ్ల వృద్ధుడు తన 25 ఏళ్ల మనవరాలిని పెళ్లి చేసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, హాట్ టాపిక్‌గా చర్చనీయాంశమైంది.ఈ వివాదాస్పద వివాహ వీడియో ఓ యూట్యూబ్ రిలీజ్ కాగా, అది కాస్త వైరల్ గా మారింది.

ఆమెను చూసిన తొలి చూపులోనే  ప్రేమలో పడ్డా.. 

కొద్ది గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోలో, 70 ఏళ్ల ఓ వ్యక్తి తన 25 ఏళ్ల మనవరాలిని వివాహం చేసుకున్నట్లు చూపించారు. అయితే, ఓ వ్యక్తి, “ఇంత చిన్న అమ్మాయిని, అది కూడా మీ సొంత మనవరాలిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు?” అని అడగగా, ఆ వృద్ధుడు, “ ఏం చెప్పాలి? ఆమె పుట్టినప్పుడే నేను ఆమెతో ప్రేమలో పడ్డాను. ఆమె ఎప్పుడు పెద్దది అవుతుందా అని చూశాను. ఇక ఇప్పుడు ఇద్దరి ఇష్టంతో మేము పెళ్లి చేసుకున్నాం,” అని సమాధానం ఇచ్చాడు. ఆ 25 ఏళ్ల యువతి మాట్లాడుతూ, “ఈ పెళ్లి నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నా తాతను బాగా చూసుకుంటా.. నాకు ఎల్లప్పుడూ ప్రేమ, గౌరవం ఇస్తాడు,” అని చెప్పింది. వారి సమాధానాలు విన్న అక్కడి వారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. వీరిద్దరూ సంతోషంగా కనిపించినప్పటికీ, ఈ సంబంధం చూసే వారికీ వింతగా ఉంది.

 

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం