PM Condolence Message: అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లు అరవింద్‌కు ఒక సంతాప సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో ఆయన ఇలా పేర్కొన్నారు.. “శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. తల్లి మరణం కుటుంబానికి తీరని లోటు. ఆమె మనకు తొలి మార్గదర్శి, బలానికి మూలం జీవితాంతం నైతిక దిక్సూచి. ఆమె దయ, ఆప్యాయత కుటుంబాన్ని పోషించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆమె కంటి దానం నిర్ణయం ఒక జీవితానికి కాంతిని అందిస్తుంది. ఇది ఆమె ఉదారతకు చిహ్నం. ఈ దుఃఖ సమయంలో నా ప్రగాఢ సానుభూతి. మీ కుటుంబానికి నా ప్రార్థనలు. ఓం శాంతి!” ఈ సందేశం అల్లు కుటుంబాన్ని ఎంతగానో ఓదార్చింది. ఆమె జీవితాన్ని, విలువలను చివరి కోరికను గౌరవించిన విధంగా మోదీ గారు పంపిన సందేశం తమను కదిలించిందని అల్లు అరవింద్ తెలిపారు.
Read also-Viral Wedding Video: మనవరాలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.. ఆమె పుట్టినప్పుడే ప్రేమలో పడ్డా?
అల్లు అరవింద్, తన నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ ఎక్స్ ఖాతా ద్వారా ప్రధానమంత్రి మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తన లేఖలో ఇలా రాశారు..
“గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, నా తల్లి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి మరణం సందర్భంగా మీరు పంపిన దయాపూర్వక, హృదయపూర్వక సందేశానికి నా కుటుంబం తరపున నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమె జీవితం, విలువలు ఆమె ఉదార చర్య గురించి మీరు ప్రస్తావించిన విధానం మమ్మల్ని కదిలించింది. ఆమె జ్ఞాపకాలను మీరు ఇంత గౌరవంగా స్మరించడం మాకు ఎంతో ఓదార్పునిచ్చింది. మీ సందేశం మాకు శాశ్వత బలాన్ని అందిస్తుంది.” అంటూ రాసుకొచ్చారు.
Read also-Allari Naresh: మత్తెక్కిస్తున్న ‘ఆల్కహాల్’ టీజర్.. పర్ఫామెన్స్ చింపేశాడు భయ్యా..
అల్లు కనకరత్నమ్మ గారు, ప్రముఖ నటుడు దివంగత అల్లు రామలింగయ్య భార్య, అల్లు అర్జున్ నాయనమ్మగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రసిద్ధులు. ఆమె వయసు సంబంధిత అనారోగ్య కారణాలతో 2025 ఆగస్టు 30వ తేదీ శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 94 సంవత్సరాల వయస్సులో ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమను శోకసముద్రంలో ముంచెత్తింది. ఆమె అంత్యక్రియలు అదే రోజు మధ్యాహ్నం కోకాపేటలో జరిగాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి తదితర కుటుంబ సభ్యులు అంత్యక్రియలలో పాల్గొని ఆమెకు నీరాజనం అర్పించారు.
We remain grateful to Hon’ble Prime Minister Shri @narendramodi ji for honouring the memory of my mother, Smt. Allu Kanakaratnamma Garu, with such warmth and respect. His message has deeply touched us.@PMOIndia pic.twitter.com/v2B0XSWahE
— Geetha Arts (@GeethaArts) September 4, 2025