Revanth-Reddy
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Bathukamma Sarees: బతుకమ్మ చీరలు వచ్చేస్తున్నాయ్.. హైదరాబాద్‌లో ఎన్ని పంచుతారంటే?

Bathukamma Sarees: ఈ నెల 21 నుంచి ఉత్సవాలు

త్వరలో సిటీకి 11 లక్షల బతుకమ్మ చీరలు
28న ఎల్బీ స్టేడియంలో 11 వేల మందితో బతుకమ్మ
అదే రోజు నుంచి బతుకమ్మ పోటీలు
నెక్లెస్ రోడ్డులో మూడు రోజుల ఫుడ్ ఫెస్టివల్
ఈ సారి స్పెషల్ కార్నివల్, పరేడ్‌లు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక, ప్రతిఏడాది ఘనంగా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలను ఈసారి గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సిటీలోని సుమారు 11 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళల కోసం త్వరలోనే బతుకమ్మ చీరలు (Bathukamma Sarees) అందనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 11 లక్షల చీరలను  జీహెచ్ఎంసీకి కేటాయించనుంది. ఈ చీరలు నేడో, రేపో జీహెచ్ఎంసీకి అందగనుండగా, త్వరలోనే సర్కిళ్ల వారీగా పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీకి సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించే యోచనలో జీహెచ్ఎంసీ అధికారులున్నారు.

ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలో జరుపుకునే ఓనం పండుగ మాత్రమే చీరల పంపిణీలో రికార్డు సృష్టించగా, ఆ రికార్డును ఈసారి బద్దలు కొట్టేలా బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. గతంలో పలుసార్లు ఈ రికార్డు సాధించాలని వేడుకలను నిర్వహించినా, వివిధ కారణాలతో విఫలమైన జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం ఈ సారి పక్కా ప్లాన్‌తో ఉత్సవాల నిర్వహణకు ప్లాన్ చేస్తోంది.

ఈ నెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు, నవరాత్రులు మొదలవుతున్న నేపథ్యంలో 27న వరల్డ్ టూరిజం డే సందర్భంగా మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించటంతో పాటు ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో సుమారు పదకొండు వేల మంది స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇందుకుగానూ సిటీలోని 30 సర్కిళ్ల నుంచి మహిళలను తరలించేందుకు 150 బస్సులను వినియోగించనున్నట్లు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (యూసీడీ) పంకజ తెలిపారు.

ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా ఘనంగా బతుకమ్మ వేడులను నిర్వహించేందుకు అప్పర్ ట్యాంక్ బండ్‌పై స్పెషల్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో తెలంగాణలోని వివిధ రకాల చేతి వృత్తుల వారు తయారు చేసిన కళాఖండాలు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శన, విక్రయం కోసం అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు తెలంగాణ వంటకాలతో నెక్లెస్ రోడ్డులో 3 రోజుల పాటు స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించటంతో పాటు బతుకమ్మల పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మహిళలకు స్పెషల్ ట్యాగ్‌లు

ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంగా నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు స్పెషల్ ట్యాగ్‌ కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఇదే తరహాలో రికార్డు లక్ష్యంగా నిర్వహించిన ఈ వేడుకల్లో స్టేడియం ఎంట్రెన్స్ వద్దకు వచ్చే మహిళలకు ట్యాగ్ లు వేసే కార్యక్రమం చేపట్టగా, ట్యాగ్‌లు వేసేందుకు ఎక్కువ సమయం పట్టడంతో రికార్డు సాధించేలేకపోయామన్న విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అందుకే, ఈ సారి స్వయం సహాయక బృందాల లీడర్లకు ముందుగానే ఈ ట్యాగ్‌లను అందజేయాలని భావిస్తున్నారు. మహిళలు బతుకమ్మ ఉత్సవాలకు వచ్చే ముందే వారు ఇంట్లోనే ట్యాగ్ వేసుకుని రావాలని, ఈ ట్యాగ్‌తో మాత్రమే ఎల్బీ స్టేడియంలోకి ఎంట్రీ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం