Watch: ఈ రోజుల్లో చాలా మంది.. సాంకేతికత ఈ రోజుల్లో గణనీయంగా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు సర్వసాధారణం అయిపోయాయి. ఇంట్లో టీవీ లేని ఇల్లు అరుదు. ఇదే క్రమంలో సాంకేతికతతో కూడిన స్మార్ట్ వాచ్‌లు కూడా మార్కెట్లో సులభంగా దొరుకుతున్నాయి. అయితే, ఈ వాచ్‌లను ఎక్కువగా ఎడమ చేతికే ఎందుకు ధరిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Japanese woman: అంతరిక్షంలో చిక్కుకున్నా.. ఆక్సిజన్ కావాలంటూ.. డబ్బు దోచేసిన ఫేక్ వ్యోమగామి
సాధారణంగా, 90 శాతం మంది ఎడమ చేతికి వాచ్‌ను ధరిస్తారు, కొందరు మాత్రం కుడి చేతికి పెట్టుకుంటారు. ఎడమ చేతికి ఎందుకు ధరించాలి, కుడి చేతికి ఎందుకు పెట్టుకోకూడదో చాలా మందికి సందేహం వచ్చి ఉంటుంది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. వాచ్ కనిపెట్టినప్పుడు చేతికి ధరించేలా కాకుండా, జేబులో పెట్టుకునే పాకెట్ వాచ్‌లుగా ఉండేవి.
Also Read: Hyderabad: ట్యాంక్ బండ్ వద్ద గణనాథుల జోరు.. ఇప్పటికే లక్షన్నరకు పైగా విగ్రహాల నిమజ్జనాలు
అవసరమైనప్పుడు జేబు నుండి తీసి టైం అంత అయిందో చూసి, మళ్లీ జేబులో పెట్టుకునేవారు. కాలక్రమంలో, చేతికి ధరించే వాచ్‌లు కూడా కని పెట్టారు. ముఖ్యంగా ఎడమ చేతికి పెట్టుకుంటారు. ఎందుకంటే, చాలా మంది కుడి చేతితో పనులు చేస్తారు. కుడి చేతితో పని చేస్తూ, టైం చూడటానికి ఎడమ చేతిని ఉపయోగించడం సౌకర్యంగా ఉంటుంది. ఎడమ చేతికి వాచ్ ధరించడం వల్ల పనిలో అంతరాయం లేకుండా సమయం సులభంగా తెలుసుకోవచ్చు. అలా, ఈ అలవాటు క్రమంగా ఒక ఆనవాయితీగా మారింది. ఈ రోజు కూడా స్మార్ట్ వాచ్‌లను ఎడమ చేతికే ఎక్కువగా ధరిస్తారు, ఇది సౌలభ్యం మాత్రమే కాదు, ఒక స్టైల్‌గా కూడా మారింది.
Also Read: Strange incident: హుండీ దోచేసిన వారికి.. చుక్కలు చూపించిన అమ్మవారు.. దెబ్బకు తిరిగిచ్చేసిన దొంగలు!