Japanese woman: జపాన్ లో కనీవినీ ఎరుగని మోసం జరిగింది. హోక్కైడో (Hokkaido)లో నివసిస్తున్న 80 ఏళ్ల మహిళ.. సైబర్ మోసగాడి వలలో పడి సుమారు రూ. 6 లక్షలు (5,000 పౌండ్లు) కోల్పోయింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఆ మోసగాడు తాను అంతరిక్షయాత్రికుడినని (Astronaut) చెప్పాడు. ప్రస్తుతం అంతరిక్ష నౌకలో తాను ఉన్నానని వృద్ధురాలిని నమ్మించాడు.
ఆక్సిజన్ అవసరముందని..
కొద్దిసేపు చాటింగ్ తర్వాత తాను ఉన్న అంతరిక్ష నౌక దాడికి గురైందని వృద్ధురాలికి సైబర్ నేరస్థుడు చెప్పాడు. తనకు ఆక్సిజన్ అవసరం ఏర్పడిందని.. అది లేకపోతే ప్రాణాలు కోల్పోతానని మాయమాటలు చెప్పాడు. తనకు వెంటనే డబ్బు పంపమని కోరాడు. కేటుగాడి మాటలు విన్న బాధితురాలు.. వెంటనే ఆన్ లైన్ లో 5000 పౌండ్లు పంపింది. అ డబ్బు అందిన వెంటనే ఆ కేటుగాడు ఆమెతో ఆన్ లైన్ సంబంధాలను తెంచేసుకున్నాడు.
పోలీసు అధికారి ఏమన్నారంటే?
తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధురాలు వెంటనే జపాన్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు హోక్కైడో పోలీసు అధికారి తెలిపారు. ‘సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి ఎప్పుడైనా మీ వద్ద నుంచి డబ్బు అడిగితే ఎట్టిపరిస్థితుల్లో పంపకండి. మోసం చేస్తున్నట్లు మీకు ఏమాత్రం అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి’ అని సదరు అధికారి సూచించారు.
Also Read: CM New Helicopter: చంద్రబాబుకు కొత్త హెలికాఫ్టర్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు!
వృద్ధులు ఎక్కువగా ఉండటంతో..
ప్రపంచంలోనే అత్యధికమంది వృద్ధులు ఉన్న రెండో దేశంగా ప్రస్తుతం జపాన్ ఉంది. వృద్ధులు ఎక్కువ ఉండటంతో మోసాల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జపాన్ జాతీయ పోలీస్ ఏజెన్సీ ప్రకారం.. 2024 జనవరి నుంచి నవంబర్ వరకు 3,326 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఇది 2023లో నమోదైన కేసులతో పోలిస్తే రెండింతలు అధికం. బాధితుల్లో వృద్ధులే అధికంగా ఉన్నట్లు సదరు నివేదిక తెలియజేసింది.
Also Read: Shocking Incident: అమ్మబాబోయ్.. కంటి కింద పెరిగిన పన్ను.. అవాక్కైన వైద్యులు
ఆస్ట్రేలియా మహిళ సైతం..
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి మోసంతో రూ. 4.3 కోట్లు (7,80,000 డాలర్లు) కోల్పోయింది. అతను తన పర్స్ మలేషియాలోని కౌలాలంపూర్‌లో దొంగిలించబడిందని రూ. 2.75 లక్షలు (5,000 డాలర్లు) అవసరమని చెప్పాడు. అలా ఆర్థిక సహాయం పేరుతో తరుచూ డబ్బులు అడగటం ప్రారంభించాడు. ఫలితంగా బాధితురాలు తను దాచుకున్న డబ్బును అతడికి ఇచ్చేసి మోసపోయింది.