Shocking Incident: సాధారణంగా దంతాలు అనేవి నోటి లోపల పెరుగుతాయి. కానీ ఇందుకు భిన్నంగా ఓ వ్యక్తికి మాత్రం కంటి కింద ఎముకపై పెరిగి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ అరుదైన ఘటన చూసి వైద్యులను సైతం అవాక్కయ్యారు. బిహార్ లో 45 ఏళ్ల వ్యక్తికి ఈ విచిత్రకర పరిస్థితి ఎదురైంది. చూపు మసకబారుతుండటంతో తొలుత అతడు వైద్యుడ్ని సంప్రదించారు. తీరా అసలు విషయం తెలిశాక అతడితో పాటు వైద్యులు సైతం షాక్ కు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే..
బిహార్ లోని పాట్నాకు 45 ఏళ్ల రవి కుమార్ కంటి సమస్య తలెత్తింది. చూపు నెమ్మది నెమ్మదిగా మందగిస్తున్నట్లు అతడు ఫీలయ్యాడు. దీంతో వెంటనే పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (IGIMS) ఆస్పత్రిలోని కంటి వైద్యులను సంప్రదించారు. అతడి చూపు మందగించడంతో పాటు కంటి కింద ఎముక కాస్త వాచి ఉండటాన్ని స్కానింగ్ లో వైద్యులు గుర్తించారు. అయితే తొలుత దానిని వాపుగా భావించిన వైద్యులు.. మరింత క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. కంటి కింద ఎముకపై పెరుగుతున్నది పన్ను అని తెలిసి నిర్ఘాంతపోయారు.
శస్త్రచికిత్స చేసి తొలగింపు
కంటి ఎముకపై పన్ను పెరగడం వల్లే అతడి చూపు నెమ్మదిగా మందగించిదని వైద్యులు ధ్రువీకిరంచారు. వైద్యరంగంలో ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా వస్తుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి క్లిష్టమైనది కావడంతో పాటు కంటిచూపుకు ప్రమాదకరంగా మరే అవకాశమున్నట్లు తేలడంతో శస్త్రచికిత్స చేయాలని IGIMS వైద్యులు నిర్ణయించారు. విజయవంతంగా రవికుమార్ కు ఆపరేషన్ నిర్వహించి ఆ పంటిని తీసివేశారు. కంటికి ఆనుకొని ఉన్న ఎముకపై ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగవుతోందని.. కంటి సమస్య కూడా నెమ్మదిగా తగ్గుతోందని IGIMS వైద్యులు వివరించారు.
Also Read: CM New Helicopter: చంద్రబాబుకు కొత్త హెలికాఫ్టర్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు!
ఇటీవల పన్నుతో చూపు తెప్పించి..
ఇటీవల కెనడాలోని ఓ మహిళకు ఆమె నోటిలోని పన్ను ఉపయోగించి వైద్యులు చూపు తెప్పించారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు చెందిన గైల్ లేన్ (75) అనే మహిళ.. 10 సంవత్సరాల క్రితం ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధికి గురైంది. దీంతో ఆమె (Gail Lane) కంటి కార్నియాలు తీవ్రంగా దెబ్బతిని చూపు కోల్పోయింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు ‘టూత్ ఇన్ ఐ సర్జరీ’ అనే అరుదైన చికిత్సను వైద్యులు చేశారు. కంటికి సహజంగా ఉండే కార్నియా పనిచేయనప్పుడు దానిని భర్తీ చేసేందుకు ఈ టూత్-ఇన్-ఐ సర్జరీ (Tooth-in-Eye Surgery)ని రోగికి చేస్తారు. చికిత్సలో భాగంగా రోగి నోటిలోని పంటి ముక్క (సాధారణంగా కేనైన్ పన్ను)ను తీసి అందులో లెన్స్ లేదా సూక్ష్మ దూరదర్శినిని అమరుస్తారు. ఇలా చేయడం వల్ల ఆ లెన్స్ కంటిలో ‘కొత్త కార్నియా’లా పనిచేస్తుంది.