CM New Helicopter: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) కొత్త హెలికాఫ్టర్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బెల్ కంపెనీ తయారు చేసిన ఛాపర్ ను ఉపయోగించిన ఆయన.. తాజాగా అత్యాధునిక ఎయిర్ బస్ హెచ్ 160 (AIR Bus H160) మోడల్ ను వినియోగిస్తున్నారు. ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటుతో పాటు.. ప్రతీకూల వాతావరణంలోనూ సమర్థవంతంగా ప్రయాణించగలగడం ఈ హెలికాఫ్టర్ ప్రత్యేకతలుగా చెబుతున్నారు. దీంతో ఈ నయా హెలికాఫ్టర్ గురించి ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో AIR Bus H160లో ఉన్న మరిన్ని అత్యాధునిక ఫీచర్ల ఏంటో ఇప్పుడు చూద్దాం.
255 కి.మీ వేగంతో రయ్ రయ్..
సీఎం చంద్రబాబు వినియోగిస్తున్న AIR Bus H160 హెలికాఫ్టర్ గంటకు 255కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 890 కి.మీ (500 నాటికల్ మైళ్లు) దూరాన్ని చేరుకోవచ్చు. ఈ హెలికాఫ్టర్ కు రెండు 2 x Safran Arrano 1A టర్బోషాఫ్ట్ ఇంజన్లను అమర్చారు. ప్రతీ ఒక్కటి 955 kW (1,280 shp) శక్తిని అందిస్తాయి. ఈ ఇంజిన్లు గంట ప్రయాణానికి 250-300 లీటర్లు (66-79 గ్యాలన్లు) ఇంధనాన్ని ఖర్చు చేస్తాయి. మెుత్తం ఇందులో 12 మంది వరకూ ప్రయాణంచే వెసులుబాటు ఉంది.
సెక్యూరిటీ పరంగా..
భద్రతాపరంగానూ ఈ హెలికాఫ్టర్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. EASA CS-29 సర్టిఫికేషన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా అత్యంత కఠినమైన నిబంధనలను అనుసరించి దీనిని నిర్మాణం చేశారు. అంతేకాదు ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసుకు సైతం ఈ హెలికాఫ్టర్ అనుకూలం. స్ట్రెచర్ లేఅవుట్ ఆప్షన్లతో వైద్య సేవలకు అనువైనదిగా దీన్ని నిర్మించారు. సన్ లైట్ తగ్గినా, ఆకాశం మేఘావృతంగా ఉన్నా కూడా ఇందులోని అడ్వాన్స్ టెక్నాలజీ కారణంగా ఎలాంటి అవంతరాలు లేకుండా ప్రయాణించవచ్చు.
ఆ సమస్యకు చెక్..
పాత హెలికాఫ్టర్ కారణంగా సీఎం చంద్రబాబు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఏదైనా జిల్లాలో పర్యాటించాల్సి వచ్చినప్పుడు ఉండవల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో జిల్లాలకు చేరుకునేవారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభ వేదికల వద్దకు వెళ్లేవారు. ప్రస్తుత హెలికాఫ్టర్ తో ఈ ప్రక్రియకు స్వస్థి పడనుంది. చంద్రబాబు నేరుగా రాష్ట్రంలో కోరుకున్న ప్రాంతంలో ల్యాండ్ అయ్యేందుకు వీలు ఏర్పడింది.
Also Read: Jagan vs RRR: జగన్‌కు బిగ్ షాక్.. పులివెందులలో బై ఎలక్షన్స్.. బాంబ్ పేల్చిన రఘురామ!
వైసీపీ విమర్శలు
సీఎం చంద్రబాబు కొత్త హెలికాఫ్టర్ వినియోగించడంపై విపక్ష వైసీపీ (YSRCP) తీవ్రంగా మండిపడుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న ఈ సమయంలో కొత్త హెలికాప్టర్.. రాష్ట్ర ఖజానాపై మరింత భారం మోపుతుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రానికి ఆదాయం లేని పరిస్థితుల్లో ఇలాంటి విలాసవంతమైన ఖర్చులు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పథకాల అమలుపై చిత్తశుద్ధి లేకుండా.. విలాసవంతమైన ప్రయాణాల కోసం సీఎం, మంత్రులు డబ్బు వృథా చేయడం సమంజసం కాదని వాదిస్తున్నారు.