GHMC
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

GHMC Salary delay: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు.. ఎన్ని కోట్లు కావాలంటే?

GHMC Salary delay: బల్దియా ఉద్యోగులకు జీతాల వ్యథలు

ఇంకా అందని జీతాలు, పెన్షన్లు
ప్రధాన కార్యాలయం చుట్టూ రిటైర్డు ఉద్యోగుల ప్రదక్షిణలు
ఆందోళనలో ఉద్యోగులు, రిటైర్డు ఎంప్లాయీస్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో అతిపెద్ద స్థానిక సంస్థగా ఉన్న జీహెచ్ఎంసీలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ చేసిన అప్పులకు ప్రతి నెల రూ.వంద కోట్ల నుంచి రూ. 110 కోట్ల వరకు అసలు, వడ్డీలు చెల్లిస్తున్నందున జీహెచ్ఎంసీ… ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు ఇంకా (GHMC Salary delay) చెల్లించలేదని సమాచారం. పైగా శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయోనని ఉద్యోగులు, కార్మికులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు నేరుగా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోని సంబంధిత సెక్షన్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ప్రతి నెల 1వ తేదీన క్రెడిట్ అయ్యే జీతాలు, పెన్షన్లను సకాలంలో ఇప్పించాలని పలు యూనియన్లు ప్రతి నెలాఖరులో కమిషనర్, అదనపు కమిషనర్‌లకు (ఫైనాన్స్) వినతి పత్రాలు సమర్పించాల్సి వస్తుంది.

ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని సుమారు మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, మరో 24 వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల జీతాలు, రిటైర్డు ఉద్యోగుల పెన్షన్లతో కలిపి జీహెచ్ఎంసీ ప్రతి నెలా రూ. 136 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు ఖజానాలో మొత్తం రూ. 136 కోట్లు లేకపోవటంతో అధికారులు ఈ నెల 2వ తేదీ నుంచి దశల వారీగా జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. చార్మినార్ జోన్ ఉద్యోగులు, కార్మికులకు ఇంకా చెల్లించలేదని, వారికి కూడా ఆటోమిటక్ చెల్లింపులు మంగళవారం రాత్రి లోగా పూర్తవుతాయని అధికారులు చెప్పారు. అయినా, ఉద్యోగులు, కార్మికుల ఖాతాల్లో జీతాలు క్రెడిట్ కాకపోవటంతో వారు యూనియన్లను ఆశ్రయించారు. దీంతో యూనియన్ నేతలు ప్రధాన కార్యాలయంలోని కమిషనర్, అదనపు కమిషనర్(ఫైనాన్స్), ఫైనాన్షియల్ అడ్వైజర్‌లను కలిసినట్లు సమాచారం.

Read Also- Allu Arjun and Anushka: ‘పుష్ప’ యూనివర్స్‌లో ‘ఘాటి’ కూడా భాగమా?.. పుష్పరాజ్‌తో షీలావతి!

అదనపు భారం…సిబిల్ రేటుకు దెబ్బ

జీహెచ్ఎంసీలోని మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులతో పాటు మరో 24 వేల మంది ఔట్ సోర్స్ కార్మికులు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది ఆటోమోబైల్, మొబైల్, ఇంటి, మ్యారేజ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్‌తో పాటు ఇతర రకరకాలుగా రుణాలు తీసుకుని, ప్రతి నెల 3 నుంచి 5వ తేదీలోపు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంది. కానీ, ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు ఇంకా వారి ఖాతాల్లో క్రెడిట్ కాకపోవటంతో ఈ నెల తమ ఈఎంఐకు పెనాల్టీ ఛార్జీల అదనపు భారం తప్పేట్టు లేదని వాపోతున్నారు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరక ముందు కూడా ప్రతి నెల 1వ తేదీన చెల్లించాల్సిన జీతాలు పది నుంచి పదిహేను తేదీల్లో చెల్లించటంతో తమ ఈఎంఐ బౌన్స్ అవుతున్నాయని,  పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోందని, తరచూ ఈఎంఐలు బౌన్స్ కావటంతో బ్యాంకు ఖాతా సిబిల్ స్కోర్లు కూడా పడిపోతున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also- Financial Struggles: లక్షా 30 వేల జీతం చాలడం లేదంటున్న 26 ఏళ్ల యువకుడు.. ఖర్చులు ఏంటంటే

రిటైర్డు ఉద్యోగుల వెతలు వర్ణణాతీతం

జీహెచ్ఎంసీ గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌గా ఏర్పడిన 1980లో మంజూరు చేసిన అన్ని క్యాటగిరీల సిబ్బంది మొత్తం 11 వేల మంది ఉండేవారు. కాగా, ప్రతి నెల పదుల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్డు అవుతున్నందున ప్రస్తుతం పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య సుమారు మూడున్నర వేలకు పడిపోయింది. ఇక, రిటైర్డు అయి ప్రతి నెలా పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా దాదాపు నాలుగు వేల వరకున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది రిటైర్డు ఉద్యోగులను తమ పిల్లలు చూడకపోవటంతో వారు వేరుగా నివాసముంటున్నారు. ఇలా ఉన్నవారిలో అత్యధిక శాతం మంది బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడిన పెన్షన్‌దారులే కావడం గమనార్హం. వీరంతా ప్రతి నెల తమ ఖాతాల్లో క్రెడిట్ పెన్షన్‌గా వచ్చే డబ్బుతోనే నెల పోషణ, ప్రతి నెల షుగర్, బీపీ మందులను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారికి ఇంకా పెన్షన్లు అందక, మందులు కొనుగోలు చేయలేక, వేరే వారిని అడగలేకా, నానా ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం