Viral-News-Photo
Viral, లేటెస్ట్ న్యూస్

Financial Struggles: లక్షా 30 వేల జీతం చాలడం లేదంటున్న 26 ఏళ్ల యువకుడు.. ఖర్చులు ఏంటంటే

Financial Struggles: ఆర్థిక నిర్వహణపై (Financial Struggles) సరైన అవగాహన లేకుంటే, ఎంత డబ్బు సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అంతా భ్రాంతియేనా అనే ఆందోళన కలుగుతుంది. అలాంటి పరిస్థితినే 26 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఎదుర్కొంటున్నాడు. ‘అన్‌లక్కీ హోల్’ అనే రెడిట్ (Reddit) యూజర్ తన ఆర్థిక కష్టాలను నెటిజన్ల వద్ద ఏకరువు పెట్టుకున్నాడు. జీతం పెరుగుదల కోసం గత కొంతకాలంగా ఉద్యోగాలు మారుతున్నానని, ఈక్రమంలో తన శాలరీ నెలకు రూ. 40,000 నుంచి ఏకంగా లక్షా 30 వేల రూపాయలకు పెరిగిందని, అయినా, చాలడం లేదంటూ వాపోయాడు. జీతం క్రమంగా పెరిగిందని, అదనంగా అంత జీతం పెరిగినా కొంచెం కూడా సంతోషంగా లేదని, ఆదాయాన్ని ఆస్వాదించలేకపోతున్నానంటూ విచారం వ్యక్తం చేశాడు. అప్పులు, కుటుంబ బాధ్యతలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని యువకుడు చెప్పాడు.

తన కుటుంబం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిందని, అవి తీర్చుతున్నానని యువకుడు చెప్పాడు. ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో తన తండ్రి అనారోగ్య సమస్యలకు ఖర్చులు తడిసి మోపెడు అయ్యాయని, ఆస్పత్రి ఖర్చులన్నీ తన భుజాలపైనే పడ్డాయని చెప్పాడు. పలు నిబంధనలను కారణంగా చూపి హెల్త్ ఇన్సూరెన్స్ తిరస్కరించడంతో హాస్పిటల్ బిల్లులు భారీగా చెల్లించాల్సి వచ్చిందని చెప్పాడు. ఈఎంఐల భారం కూడా గట్టిగానే ఉందని చెప్పాడు. అంతేనా, ప్రస్తుతం ఖరీదైన నగరానికి తరలి వెళ్లానని, శాలరీ పెరిగినప్పటికీ, ఖర్చులు కూడా అధికంగా ఉంటున్నాయని తెలిపాడు. రెంట్, భోజనం, ప్రయాణం, ఇతర ఐఎంఐలు ఇలాంటివన్నీ కలిపి నెలకు రూ. 70,000 – 75,000 వరకు ఖర్చవుతోందని వివరించాడు. అందుకే, చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదని, తనపై ఒత్తిడి తగ్గడం లేదని విచారం వ్యక్తం చేశాడు.

భవిష్యత్ గురించి లగ్జరీకి దూరం

26 ఏళ్ల రెడిట్ యూజర్ తన భవిష్యత్ ప్రణాళికలను కూడా వెల్లడించాడు. తన జీవనశైలిని సాధ్యమైనంత తక్కువ ఖర్చులతో కొనసాగిస్తున్నానని చెప్పాడు. ఖర్చులు తగ్గించుకునేందుకు ఆఫీస్‌కు నడిచి వెళ్తున్నానని, లగ్జరీ ఖర్చులను పూర్తిగా తగ్గించుకొని బతుకుతున్నానని వివరించాడు. అయినప్పటికీ, తనకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ లభించడంలేదని, అసలు ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టంగా అర్థం కావడం లేదని నిట్టూర్చాడు. భవిష్యత్ కోసం సిప్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో నెలకు రూ. 2,000 నుంచి రూ. 15,000 వరకు పెట్టుబడి పెడుతున్నానని, తల్లిదండ్రుల కోసం మెడికల్ ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నానని వివరించాడు. ఈఎంఐలపై పార్ట్-ప్రీపేమెంట్లు చేసి అప్పుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపాడు. మరోవైపు, రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, అందుకోసం సేవింగ్స్ మొదలుపెట్టానని వివరించాడు.

Read Also- Upload Season 4: అప్పుడు ఏఐ ఏం చేయబోతుందో తెలియాలంటే.. ఈ సిరీస్ చూడాల్సిందే..

అయితే, తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని ఆ యువకుడు తెలిపాడు. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో పెట్టుబడులు, అప్పుల చెల్లింపులు, భవిష్యత్తు ఖర్చులను ఎలా సమతుల్యం చేసుకోవాలని నెటిజన్లను ప్రశ్నించాడు. ఆత్మవిశ్వాసాన్ని ఎలా నిలుపుకోవాలి?, తల్లిదండ్రుల కోసం మంచి ఆరోగ్య బీమా పాలసీని ఎలా తీసుకోవాలి? అని ప్రశ్నించాడు.

నెటిజన్లు ఏమంటున్నారంటే..

తల్లిదండ్రుల అప్పును తీర్చడంతో పాటు తనను తాను పోషించుకోగలిగే స్థాయికి చేరుకున్నావంటూ చాలామంది నెటిజన్లు ఆ యువకుడిని మెచ్చుకున్నారు. ‘‘ నువ్వు జీవితంలో ఇప్పటికే విజయం సాధించావ్ బ్రో. అందరినీ సంతోషంగా ఉంచడం, అవసరాల్లో సహాయం చేయగలగడం నిజమైన లక్ష్యం. ఖర్చులను దృష్టిలో పెట్టుకోకండి’’ అంటూ ఓ నెజటిన్ సలహా ఇచ్చాడు. ‘‘పెట్టుబడి గురించి ఆలోచించేముందు, ముందు అప్పులు తీర్చేయండి. పెళ్లి అప్పుడే చేసుకోకు. మరికొన్నాళ్లు ఆగు. ఇన్సూరెన్స్ విషయంలో చీప్ పాలసీ కోసం ఏజెంట్ల మాటలు నమ్మవద్దు. అవసరానికి ఆసుపత్రిలో క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది’’ అని మరో యూజర్ సూచించాడు.

Read Also- Hyderabad: గణేష్ నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఆ మార్గాలు క్లోజ్.. అటు వెళ్లారో బుక్కైపోతారు!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం