Crime News: బాకీ తీర్చమని అడిగిన పాపానికి తండ్రీకొడుకులపై దాడి చేసిన గంజాయి బ్యాచ్ విచక్షణారహితంగా కొట్టింది. దాంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికం కలకలం సృష్టించిన ఈ సంఘటన హయత్ నగర్(Hayath Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. హయత్ నగర్ శాంతినగర్ నివాసి రోషి యాదవ్(Roshi Yadav) రంగుల దుకాణం నడిపిస్తున్నాడు. మూడు నెలల క్రితం వృత్తిరీత్యా పెయింటర్ అయిన రాజశేఖర్ అతని నుంచి అరువుపై 3వేల రూపాయల విలువ చేసే రంగులు తీసుకు పోయాడు. 2వేల రూపాయలు ఇచ్చి మిగిలిన వెయ్యి రూపాయలు ఇవ్వలేదు. దాంతో రోషి యాదవ్ డబ్బు కోసం అతన్ని పలుమార్లు అడిగాడు.
రోషి యాదవ్ పై దాడి..
దాంతో రాజశేఖర్ రెండు రోజుల క్రితం రోషి యాదవ్ కు ఫోన్ చేసి భాగ్యలత ఐ హాస్పిటల్ వద్దకు వస్తే బాకీ తీర్చేస్తానని చెప్పాడు. దాంతో రోషి యాదవ్ అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ రాజశేఖర్ అతని స్నేహితులు పది మంది ఉన్నారు. మద్యం, గంజాయి సేవించి ఉన్న వీళ్లంతా ఒక్కసారిగా రోషి యాదవ్ పై దాడి చేసి కొట్టటం మొదలు పెట్టారు. విషయం తెలిసి రోషి యాదవ్ కుమారుడు అఖిల్ అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై కూడా దాడి చేశారు. దాంతో తండ్రీకొడుకులకు రక్తసిక్త గాయాలయ్యాయి. ఈ మేరకు ఫిర్యాదు అందగా హయత్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Ramchander Rao: ఆప్టికల్ ఫైబర్ సౌకర్యాలు లేక.. ఇబ్బందుల్లో కేబుల్ ఆపరేటర్స్!
పాతబస్తీలో..
ఇదిలా ఉండగా పాతబస్తీలో మరో గ్యాంగ్ గంజాయి అమ్మాలంటూ అన్నదమ్ములను నిర్భంధించి చితకబాదింది. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోలు వైరల్ కావటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. భవానీనగర్ ప్రాంతంలో నివాసముంటున్న అన్నదమ్ములు గతంలో స్థానికంగాఉంటూ గంజాయి అమ్ముతున్న వారి వద్ద కొన్నిరోజులు పని చేశారు. ఇటీవలే పని మానివేశారు. దాంతో విక్రయందారులు తమ తరపున గంజాయి అమ్మకాలను సాగించాలని ఇద్దరిని చితక బాదారు.
Also Read: Turakapalem: డేంజర్ బెల్స్.. తురకపాలెం ప్రాంతంలో మట్టి పరీక్షలు వెలుగులోకి సంచలనాలు.. ?