Turakapalem:ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తురకపాలెం పరిసర ప్రాంతాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్టు చెన్నై ప్రయోగశాలలో చేసిన నీటి పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. తురకపాలెంలో మట్టి పరీక్షలు నిర్వహించిన ICAR నేతృత్వంలోని ప్రైవేట్ సంస్థ అక్కడ యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు వార్తలు వస్దున్నాయి. ప్రయోగం ICAR అధికారులు అక్కడి మట్టిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. యురేనియం అవశేషాల వల్లే అక్కడ అనారోగ్య సమస్యలు అని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తురకపాలెం పరిసరాల్లోని క్వారీ గుంతల నీటిలో యురేనియం అవశేషాలున్నయని వారు అనుమానిస్తున్నారు. అక్కడి ప్రజలు క్వారి తవ్వకాల్లో పనిచేసి అక్కడి నీటిని ఉపయోగించడం వలన వారు అనారోగ్యానికి గురైనట్టు అధికారులు భావిస్తున్నారు.
నెలలో 29 మంది ప్రజలు చనిపోయారు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు మండలంలో తరురకపాలెం అనే గ్రామంలో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురై ఆ ప్రాంతాల్లో మరణాలు సంభవించాయి. అయితే గత కోన్ని రోజుల క్రితం అదే గ్రామంలో ఓకే నెలలో 29 మంది ప్రజలు చనిపోయినట్టు అధికారుల గుర్తించారు. ఇ మరనాలకు కారణం ఎంటని అధికారులు పరీక్షించగా ఆ పరిసర ప్రాంతాల్లోని మెలియాయిడోసిస్ అనే బాక్టీరియా వ్యాప్తి అని తెలిపారు. ఈ భాక్టీరియా బుర్క్ హోల్డేరియా సూడోమల్లి అనే భాక్టీరియా వల్ల సంభవిస్తుందని తెలిపారు. ఇది మట్టి, మరియు నిలిఉన్న నీటిపై సాధారణంగా కనిపిస్తుందరని అధికారులు తెలిపారు. ఈ భాక్టీరియా అంత ప్రమాదకరం కాక పోయిన, కిడ్నీ సమస్యలు, డయాబెటీస్ వ్యాధులు ఉన్నవారికి ఇది ప్రాణాంతకం కావచ్చు అని పరీక్షలో తేలిందని అధికారులు తెలిపారు.
Also Read: Crime News: మాయమాటలతో మైనర్ బాలికపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు..?
తురకపాలెం చుట్టు పక్కల ప్రాంతాల్లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామానికి ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆ గ్రామంలోని ప్రజలందరికి పరీక్షలు చేసి ఆరోగ్య ప్రోఫైల్ ని తయారు చేపిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) బృందం ఆ గ్రామంలోకి వచ్చి ఆ ప్రాంత మట్టి, నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ది పెడరల్ న్యూస్ లో ప్రచురితమైన కథనం ప్రకారం, చెన్నైలాబ్ లో చేసిన నీటి పరీక్షలో తురకపాలెం చుట్టు పక్కల ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు పరీక్షలో తేలింది. దీంతో అక్కడి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఈ సమస్య గత కొన్ని నెలల్లోనే ఆ ప్రాంతాల్లో 48 మంది మరనించారని తెలిపింది. యురేనియం వలన చర్మసమస్యలు, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యలు తెలిపారు.
Also Read: Huzurabad Heavy Rains: హుజురాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షం.. లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం