Drugs Seized (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. భారీగా హెరాయిన్ పట్టివేత

Drugs Seized: హైదరాబాద్ (Hyderabad) ‎లో మరోమారు డ్రగ్స్ కలకలం రేపాయి. శంషాబాద్ రాయికల్ టోల్ గెట్ వద్ద భారీగా హెరాయిన్‌ డ్రగ్స్ (Heroine Drugs)ను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి (Avinash mahanthi) మీడియా ముఖంగా వెల్లడించారు. షాద్‌నగర్‌లోని సంజు భాయ్ మార్వాడి దాబా (Sanju Bhai Marvadi Dhaba) లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న తమకు అందినట్లు తెలిపారు. అక్కడ వెంనటే నిఘా పెట్టి.. హెరాయిన్ తో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు

అరకిలో హెరాయన్ పట్టివేత
సీజ్ చేసిన డ్రగ్స్ విలువ దాదాపు రూ. 3 కోట్ల వరకూ ఉంటుందని సైబరాబాద్ కమిషనర్ స్పష్టం చేశారు. ఒక్కో గ్రామ్ ను రూ.15వేల వరకూ విక్రయిస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.హోటల్ లో పనిచేసే వంట మనిషి రాజస్థాన్ నుండి డ్రగ్స్ ను తీసుకొచ్చి.. తెలిసిన కస్టమర్స్ కి విక్రయిస్తున్నట్లు చెప్పారు. రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madya Pradesh) నుండి ఓపీఎం డ్రగ్స్ తెస్తున్నట్లు వివరించారు. సీజ్ చేసిన హెరాయిన్ అరకిలో వరకూ ఉందని చెప్పారు.

Also Read: Nandi Awards in AP: అవార్డులు నిల్.. వివాదాలు ఫుల్.. ఏపీలో నంది సంగతేంటి!

గతంలోనే డ్రగ్స్ కేసులో అరెస్ట్
అరెస్ట్ చేసిన వికాస్ (Vikas), సంజూ భాయ్ (Sanju Bhai).. గతంలోనే డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లారని పోలీసులు తెలిపారు. 2022లో వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు బస్సు ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు తెలిపారు. దాబా యజమాని చనిపోవడంతో ఏప్రిల్ లో వికాస్ హోటల్ ను టేకప్ చేశాడు. అప్పటి నుంచి రహస్యంగా డ్రగ్స్ సేల్ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వికాస్ డ్రగ్స్ ను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు? అతడి వెనక ఎవరెవరు ఉన్నారు? అన్న కోణంలో మరింత దర్యాప్తు చేయనున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

Also Read This: MLC Kavitha: మనసులో బాధ కక్కేసిన కవిత.. బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై షాకింగ్ కామెంట్స్!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ