BMS New Office: ఈ నెల 25న ట్రేడ్ యూనియన్ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర నూతన కార్యాలయ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్(Srinivas), ప్రధాన కార్యదర్శి తూర్పు రాంరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మెట్రో పిల్లర్ నెం.39 పక్కన, స్ట్రీట్ నెంబర్ 9లోని బీఎంఎస్ పాత ఆఫీసు చోట నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు.
Also Read: Ustaad Bhagat Singh: ‘స్టెప్ ఏస్తే భూకంపం’.. దేఖ్‌లేంగే సాలా సాంగ్ ప్రోమో అదిరింది
బాగ్ లింగంపల్లిలోని..
ఉదయం 9:30 గంటల నుంచి నూతన భవనం ప్రాంగణంలో చండీ హోమం, పూర్ణాహూతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం సభా కార్యక్రమాన్ని బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఉదయం 10:30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దత్తాత్రేయ హోసబలే, విశిష్ట అతిథిగా బీఎంఎస్ అఖిల భారత అధ్యక్షులు భాగయ్య హాజరు కానున్నారు. అలాగే, అతిథులుగా బీఎంఎస్ అఖిల భారత అధ్యక్షులు హిరణ్మయి పాండ్య, బీఎంఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవీంద్ర హింటే, బీఎంఎస్ అఖిల భారత సంఘటన కార్యదర్శి సురేంద్రన్‌లు హాజరుకానున్నట్లు వారు తెలిపారు.

