Gachibowli lands (IMAGE credit: twitter)
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Gachibowli lands: గచ్చిబౌలి భూముల అక్రమ అనుమతుల వ్యవహారం

Gachibowli lands: బీఆర్ఎస్ ప్రభుత్వంలో లిటిగేషన్ భూముల్లో ఎన్నో కంపెనీలు పాగా వేశాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలను, అధికారులను మచ్చిక చేసుకుని లబ్ధి పొందాయి. ఇప్పుడు వాటన్నింటికీ చిక్కులు మొదలయ్యాయి. వరుసగా లోకాయుక్త, రెరాకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కంపెనీల బండారం మొత్తం బయటకు వస్తున్నది.


 Also Read: Swetcha Effect: ‘స్వేచ్ఛ’ కథనంపై స్పందించిన కలెక్టర్ అనుదీప్

గచ్చిబౌలి భూముల్లో వాసవి, శాంతా శ్రీరామ్ పాగా


వాసవి గ్రూప్(Vasavi Group) అధినేత ఎర్రం విజయ్ కుమార్,(Erram Vijay Kumar) శాంతా శ్రీరామ్(Santa Sriram) మద్ది నర్సయ్యపై తెలంగాణ లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. ఎంద్రపల్లి దేవేందర్(Endrapally Devender) అనే వ్యక్తి, ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మనేని ద్వారా ఈ ఫిర్యాదు చేశాడు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పని చేసిన రోనాల్డ్ రోస్,(Ronald Ross,) ప్రస్తుతం జీహెచ్ఎంసీ(GHMC) అదనపు చీఫ్ సిటీ ప్లా‌నర్‌గా ఉన్న ప్రమోద్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని, గచ్చిబౌలి9Gachibowli)లోని సర్వే నెంబర్ 15, 16లో నిషేధిత జాబితాలో ఉన్న రెండు ఎకరాల పన్నెండు గుంటల ప్రభుత్వ భూములను వాసవి, శాంతా శ్రీరామ్(Santa Sriram)చేపట్టిన అక్రమ నిర్మాణాలకు ఓసీ(నిరభ్యంతర పత్రం) ఇచ్చారని పేర్కొన్నాడు.

రూ.3 వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 17లో తీసుకున్న అక్రమ అనుమతులతో కబ్జా పెట్టినట్టుగా వివరించాడు. కనీసం క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ లేకుండా అధికారులు క్లియరెన్స్ ఇచ్చారని, బాక్స్ డ్రైన్ నిర్మాణం పేరుతో నాలాను సైతం ఈ రెండు సంస్థలు దిగమింగాయని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై లోకాయుక్త రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రాథమిక దర్యాప్తు చేపట్టనున్నది.

నాలుగు కంపెనీలకు రెరా నోటీసులు

మరోవైపు, రియల్ ఎస్టేట్(Real estate) రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కూడా దూకుడుగా ఉన్నది. మై హోమ్,(My Home)ప్రెస్టేజ్, వాసవి జీపీ, చంద్ర గ్రీన్ పార్క్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టులో కేసులు ఉండగా తప్పుడు సమాచారం ఇచ్చి సర్టిఫికెట్ తీసుకున్నాయని ఫిర్యాదులు అందడంతో నోటీసులు పంపించింది. మైం హోమ్ సంస్థ మదీనాగూడలో నిర్మాణం చేస్తున్న భూమిపై ఎటువంటి చట్టపరమైన హక్కులు లేవని, సదరు భూమిపై కోర్టులో వివాదం ఉండగానే అక్రమంగా అనుమతులు పొందిందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ప్రెస్టేజ్, వాసవి జీపీ, చంద్ర గ్రీన్ పార్క్‌ కూడా చేపట్టిన ప్రాజెక్టుల్లో అనేక లిటిగేషన్స్ ఉన్నాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెరా నోటీసులు జారీ చేసింది.

లిటిగేషన్ భూములకు క్లియరెన్స్

బీఆర్ఎస్(BRS) పాలనలో రియల్ ఎస్టేట్(Real estate) రంగంలో అనేక అక్రమాలు జరిగాయి. తమకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు లిటిగేషన్ భూముల(Litigation lands)ను ధారాదత్తం చేసిన వ్యవహారాలు ఎన్నో. ఇప్పుడు అలాంటి భూములపై వరుసగా లోకాయుక్త, రెరాకు ఫిర్యాదులు అందుతుండడంతో ప్రభుత్వ భూములకు, బాధితులకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు.

Also Read:GHMC Commissioner: మరో మూడు రోజులు అలర్ట్‌గా ఉండాలి.. కర్ణన్ కీలక ఆదేశాలు

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..