GHMC Commissioner: మహానగరంలో వరుసగా మూడు రోజుల నుంచి వర్షాలు కురస్తున్న కారణంగా సిటీలోని అన్ని చోట్ల పక్కాగా సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్(GHMC Commissioner Karnan) అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో రాజేంద్రనగర్(Rajendranagar) సర్కిల్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy)తో కలిసి క్షేత్ర పర్యటించారు. జల్‌పల్లి చెరువుతో పాటు లోతట్టు ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ వర్షాకాలంలో ప్రజల భద్రతా కోసం తీసుకుంటున్న చర్యలను క్షేత్ర స్థాయిలో సమీక్షించారు.
Also Read: Leopard Attack: శ్రీశైలంలో చిరుత కలకలం.. చిన్నారిని ఈడ్చుకెళ్లి.. ఊరి చివర వదిలేసింది!
ప్రత్యేక దృష్టి సారించాలి
మరో మూడురోజులు జీహెచ్ఎంసీ(GHNC) ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్‌తో పాటు అన్ని విభాగాల అధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. నగర ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు ట్రాఫిక్, విపత్తు బృందాలు కలిసి పనిచేయాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్‌లపై ప్రత్యేక దృష్టి సారించి, వీలైనంత త్వరగా వాటర్‌ను తోడేసి ట్రాఫిక్ ఫ్లో సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగుకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షకాలంలో నగర పౌరులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి, తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
Also Read: Khammam Police commissioner: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాగులు వంకలు దాటొద్దు.. పోలీస్ కమిషనర్ సూచనలు