Kaleswaram
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Kaleswaram: మాజీ ఈఎన్సీల కమీషన్లపై ఏసీబీ ఫోకస్

  • మొన్న హరిరాం.. నిన్న నూనె శ్రీధర్.. నేడు మురళీధర్ రావు
  • ఇరిగేషన్ శాఖలో బడా అవినీతి తిమింగళాలు
  • కాంట్రాక్టర్ల కమీషన్లతో ఇష్టారాజ్యంగా అంచనాల పెంపు?
  • నాణ్యత, ప్లానింగ్ లేకపోవడంతో ప్రమాదంలో మూడు బ్యారేజీలు
  • ప్రాజెక్ట్ నిర్మాణాల్లో ఇదే తప్పు విదేశాల్లో చేస్తే మరణ శిక్షే?
  • వ్యవసాయ భూముల్లో హరిరాం.. బంగారం, ప్లాట్ల రూపంలో శ్రీధర్..
  • బంధువులు, సన్నిహితులను కాంట్రాక్టర్లుగా మార్చిన మురళీధర్
  • మరో రిటైర్డ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు అక్రమాలు ఎప్పుడు తేలుతాయో?
  • ఏసీబీ రెయిడ్స్‌తో బినామీల వ్యవహారాలు బట్టబయలు అవుతాయా?
  • మాజీ ఈఎన్సీ, మేఘా ఉద్యోగి వెంకట రామారావు లీలలు కనిపెడుతారా?

దేవేందర్ రెడ్డి, స్వేచ్ఛ ఎడిటర్


స్వేచ్ఛ ఈ డైలీ

Kaleswaram: ఒక భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు బ్యారేజీల నిర్మాణమే గుండెకాయ. లక్ష 30 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే బ్యారేజీల నిర్మాణంలో ప్లానింగ్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. నాణ్యతలో రాజీ ఉండకూడదు. కానీ, తెలంగాణలో పదేళ్లపాటు ఇంజీనీరింగ్ ఇన్ ఛీఫ్‌గా పని చేసిన వాళ్ల నిర్లక్ష్యం, కమీషన్ల కక్కుర్తి కళ్ల ముందు కనిపిస్తున్నది. రిటైర్డ్ అయినా 9 ఏళ్లు కావాలని ఎక్స్‌టెన్షన్ ఇచ్చి పెట్టుకున్నందుకే ఇప్పుడు నీళ్లు పారని పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ సర్కార్ చేసిన వేగిరపు పనులకు తోడు ఇంజినీర్ల అక్రమ వ్యాపారాలు ప్రజా ధనాన్ని గోదావరి పాలు చేశాయి. వీటన్నింటిని బయటపెట్టి వారి పాపాల చిట్టాను విప్పేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ ముందు గత ఈఎన్సీలు అందరూ విచారణకు హజరయ్యారు. వారికి తోచింది వారు చెప్పారు. ఇదే క్రమంలో అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టి కేసులు నమోదు చేసి నిగ్గు తేల్చే పనిలో ఉన్నది. అవినీతి అధికారుల వ్యవహారాలపై ముందు నుంచి ‘స్వేచ్ఛ’ కథనాలు ప్రచురిస్తున్నది. నిజానికి, ఇలా వందల కోట్లు నష్టం చేసి, ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే విదేశాల్లో ఊరి శిక్ష కూడా విధిస్తారని హెచ్చరిస్తూ వచ్చింది. ఇదే క్రమంలో ముగ్గురు మాజీ ఈఎన్సీల అక్రమాస్తులపై ఏసీబీ దృష్టి పెట్టడం, అరెస్టులు చేయడంతో వాళ్ల పాపం పడిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరిరాం సిద్దిపేట జిల్లాలో భారీగా ఆస్తులు కూడబెట్టుకోగా, ఇటీవల అరెస్ట్ అయిన నూనె శ్రీధర్ రావు బంగారంతో పాటు నగరంలో అనేక ప్రాంతాల్లో విల్లాలు, ప్లాట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది.


Read Also- Telangana: డేటా సిటీగా హైదరాబాద్‌ మారనుంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

చీటి మురళీధర్ రావు కథే వేరు..

కాళేశ్వరంలో ప్రతి బిల్లుకు మురళీధర్ రావు సంతకం లేనిదే డబ్బులు రిలీజ్ అయ్యేవి కావు. ఈఎన్సీ అడ్మిన్‌గా కొనసాగినప్పుడు కాంట్రాక్టర్స్ వద్ద నుంచి తన సన్నిహితులకు సబ్ కాంట్రాక్ట్స్ ఇప్పించుకున్న చరిత్ర ఈయనది. కుమారుడిని ఓ కంపెనీలో డైరెక్టర్‌గా చేర్చి మరీ లాభాలు గడించారంటే అర్థం చేసుకోండి. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ వద్ద నుంచి ఎక్కడా దొరకకుండా డైవర్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అప్పటి మంత్రుల అనుచరులు వరంగల్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని తెలుస్తున్నది. ఏసీబీ ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. కీలక విషయాలు తెలుసుకున్నది. అయితే, మేఘా కంపెనీ నుంచి ఉద్యోగిగా ఉన్న మాజీ ఈఎన్సీ వెంకట రామారావు ద్వారా కూడా తతంగం నడిచిందని అనుకుంటున్నారు. అతని లీలలే కాళేశ్వరం కరెప్షన్‌కు దారి తీసిందని విమర్శలు ఉన్నాయి.

మాజీ ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు ఎక్కడ?

2019లో రిటైర్డ్ అయిన ఎన్ వెంకటేశ్వర్లును ఈఎన్సీ బాధ్యతలు ఇచ్చి కొనసాగించారు. ఇప్పుడు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి ఇయనే అప్పట్లో ఈఎన్సీ. రివైజ్ అంచనాలతో వందల కోట్లు అక్రమంగా వివిధ కాంట్రాక్టర్స్ నుంచి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క బ్యారేజీకే వంద సార్లకు పైగా ఎస్టిమేషన్ పెంచి నాణ్యతపై పర్యవేక్షణ లేకుండానే అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈయన అక్రమాస్తులపైనా ఏసీబీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అలాగే, కాళేశ్వరం కమిషన్ కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది.

Read Also- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’కు ప్రేరణ ఎవరో తెలుసా? దర్శకుడు ఏం చెప్పారంటే?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం