Telangana ( Image Source: Twitter)
తెలంగాణ

Telangana: డేటా సిటీగా హైదరాబాద్‌ మారనుంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

Telangana: ప్రపంచ బల్క్ డ్రగ్స్​‍ రాజధానిగా హైదరాబాద్‌ రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో డేటా సిటీగానూ హైదరాబాద్‌ మారనుందని ఉద్ఘాటించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌ పేట్‌ జీనోమ్‌ వ్యాలీలో ఐకార్‌ బయాలాజిక్స్​​‍ కొత్త యూనిట్‌కు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, వివేక్‌ లతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ జనోమ్‌ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకే ఒక గుర్తింపును తీసుకొచ్చాయన్నారు. దేశంలోనే 33 శాతం వ్యాక్సిన్స్​‍, 43 శాతం బల్క్‍ డ్రగ్స్​‍ జీనోమ్‌ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు.

Also Read: Raja Saab Mystery Heroine: బిగ్ ట్విస్ట్ .. ప్రభాస్ ‘రాజాసాబ్’ లో కొత్త హీరోయిన్.. లాస్ట్ మినిట్ లో మొత్తం ఛేంజ్?

కోవిడ్‌ సమయంలో ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ ను సరఫరా చేశామని గుర్తు చేశారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమినీ సాధించడమే తమ లక్ష్యమని, అందులో భాగంగా తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఈ ఏడాది డిసెంబర్‌ 9న ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. భాతర ప్రభుత్వం ముందుంచుకున్న లక్ష్యం 30 ట్రిలియన్‌ ఎకానమీకి తమవంతు తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగానే పాలసీలు, అనుమతులు, మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నామన్నారు.

Also Read: Star Heroine: 50 సెకన్ల కోసం ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్?

ఇప్పటివరకు రాష్ట్రానికి 3లక్షలకు పైగా పెట్టుబడులు

ప్రభుత్వాలు మారినా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన విధానాలను మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అవలంభించిన సరళమైన విధానాలతో ఇప్పటివరకు రాష్ట్రానికి 3లక్షల 28వేల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామన్నారు. నూతన పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నామని, వానిరి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ జీనోమ్‌ వ్యాలీ ఆసియా ఖండంలోనే ప్రత్యేకమైందిగా గుర్తింపు పొందిందన్నారు. జీవ శాస్త్ర అభివృద్దికి అవసరమైన ఎకో సిస్టమ్‌ హైదరాబాద్‌లో ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేడ్చల్‌ కలెక్టర్‌ మను చౌదరి, అదనపు కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Ponnam Prabhakar: ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ స్థంస్థగత పునఃనిర్మాణం పై తుది కసరత్తు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!