Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) చారిత్రక యోధుడిగా నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాపై ఇటీవల ఓ వివాదం నెలకొన్న నేపథ్యంలో, వెంటనే చిత్రయూనిట్ స్పందించి, ఈ సినిమా తెలంగాణకు చెందిన వీరుడి కథ కాదని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఈ మూవీ ఉంటుందని వివరణ ఇచ్చారు. పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం, వైష్ణవం మధ్య వారధిగా ఎలా అయితే వర్ణిస్తారో.. అలాగే ‘హరి హర వీరమల్లు’ను శివుడు, విష్ణువుల అవతారంగా చూడబోతున్నారని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా జూలై 24న విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన ఈ సినిమాకు ఇద్దరు దిగ్గజాలు ప్రేరణ అంటూ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
Also Read- Genelia: రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ.. ఇప్పుడున్న పొజిషన్ చూస్తుంటేనా?
‘హరి హర వీరమల్లు’ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్‌ల నుంచి ప్రేరణ పొందానని దర్శకుడు జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే.. పవన్ కళ్యాణ్‌లో ఉన్న అద్భుతమైన లక్షణాలను గమనించానని, ఆ తర్వాతే ఆయన పాత్రను రాయడానికి ప్రేరణ పొందానని తాజాగా జ్యోతి కృష్ణ పేర్కొన్నారు. ధర్మపరుడిగా, బలవంతుడిగా, ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్‌కి ఉన్న స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో ఆయన పాత్రను చాలా జాగ్రత్తగా రూపొందించినట్లు దర్శకుడు జ్యోతి కృష్ణ వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంజీఆర్ సందేశాత్మక, నిజాయితీతో కూడిన సినిమాలు చేస్తూ నట జీవితాన్ని కొనసాగించారు. ఈ అంశం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అందుకే ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ‘మాట వినాలి’ అనే శక్తివంతమైన, ఆలోచింపజేసే పాటను ఉంచడం జరిగింది. ఈ పాట యొక్క సారాంశం పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ జీవితంలో సానుకూలత, ధర్మాన్ని స్వీకరించడాన్ని తెలియజేస్తుంది. ఈ పాట ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసిందని జ్యోతి కృష్ణ తెలిపారు.
Also Read- Virgin Boys: సినిమా సమీక్షకుడిపై నిర్మాత ఫైర్.. స్పందించిన పుచుక్ పుచుక్!
అలాగే, నటుడిగా ఎన్టీఆర్ యొక్క గొప్ప ప్రదర్శనలు, పౌరాణిక, జానపద చిత్రాల నుండి వచ్చాయి. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు పాత్రలలో ఆయన ఒదిగిపోయిన తీరు ఈ భూమి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్ తన శక్తిని, ధర్మాన్ని నిలబెట్టే సామర్థ్యాన్ని సూచించే విల్లు, బాణం పట్టుకున్న శ్రీరాముడిగా అద్భుతంగా చిత్రీకరించబడ్డారు. ఈ అంశం నుండి ప్రేరణ పొంది, ‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ కోసం కోసం విల్లు, బాణాన్ని రూపొందించాము. పవన్ కళ్యాణ్ యొక్క శక్తిని సూచించడానికి, న్యాయం కోసం పోరాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతీకగా ఈ ఆయుధాలు రూపొందించబడ్డాయని జ్యోతి కృష్ణ వివరించారు. అలాగే తాను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్‌ను హీరోగా కాకుండా నాయకుడిగా చూస్తున్నారని గ్రహించానని ఆయన అన్నారు. ‘కథనాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేకంగా సృష్టించాలనుకున్నానని, సినిమా అద్భుతంగా వచ్చిందని జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు