Virgin Boys: సినిమా సమీక్షకుడిపై నిర్మాత ఫైర్..
Virgin Boys(image source :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Virgin Boys: సినిమా సమీక్షకుడిపై నిర్మాత ఫైర్.. స్పందించిన పుచుక్ పుచుక్!

Virgin Boys: ‘వర్జిన్ బాయ్స్’ సినిమా నిర్మాతగా వ్యవహరించిన రాజా దారపునేని (Raja Darapuneni) తెలుగు సినిమా సమీక్షకుడిపై ఫైర్ అయ్యారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను నిర్మించిన సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన ఓ యూట్యూబర్ పై మండి పడ్డారు. ‘వర్జిన్ బాయ్స్’ (Virgin Boys) సినిమా పాజిటివ్‌ రివ్యూ ఇవ్వడానికి 40 వేల రూపాయలు డిమాండ్ చేశాడని నిర్మాత అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నిర్మాత మాట్లాడుతూ .. ఇష్టం వచ్చినట్లు రివ్యూలు చేసే వారిని ఊరుకోమన్నారు. ఇలాంటి వారిని పోషించడం వల్ల నిర్మాతలు నాశనమైపోతున్నారని అన్నారు. చిన్న సినిమాల పరిస్థితే ఇలా ఉంటే.. రానున్న పెద్ద సినిమాల గురించి ఇలాంటి వారి ప్రచారం చాలా ప్రభావం చూపిస్తుందన్నారు. ఇంతకూ ఆ ప్రముఖ యూట్యూబర్ ఎవరంటే ‘పూలచొక్కా’ పేరుతో తెలుగు యూట్యూబ్ చానలల్ బాగా పాపులర్ అయిన నవీన్. కొత్తగా విడుదలైన సినిమాలపై నవీన్ తనకు ఉన్న యూట్యూబ్ చానల్లో రివ్యూలు ఇస్తుంటారు. అందులో ‘వర్జిన్ బాయ్స్’ సినిమాకు 0.5 టమాటాలు అనగా రేటింగ్ ఇవ్వడంతో నిర్మాత ఆవేదనకు గురై పూలచొక్కా నవీన్‌పై మండి పడ్డారు.

Also Read – Pawan Kalyan: చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్!

ఈ విషయంపై పూలచొక్కా నవీన్ స్పందించారు. ‘వర్జిన్ బాయ్స్’ సినిమా విషయంలో మూవీ టీం తనను సంప్రదించిందని అయితే ప్రమోషన్ కోసం ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరగా కొంత రెమ్యూనరేషన్ అడిగానన్నారు. దాని తర్వాత మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తర్వాత తాను కూడా ఆ విషయాన్ని వదిలేశానన్నారు. జరిగింది ఇదైతే నిర్మాత మార్చి చెబుతున్నారని అన్నారు. ఈ సినిమా రివ్యూ చేయడానికి తాను ఎలాంటి మనీ డిమాండు చేయలేదన్నారు. దీని గురించి నిర్మాతపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని అయితే తాను ఇలాంటి వాటిని పట్టించుకోనని అన్నారు. సినిమాలో లోపాలను చూపితే ఇలా చేయడం తగదన్నారు.

Also Read – BJP on BC Reservation Bill: మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం

టికెట్ కొట్టు.. ఐఫోన్ పట్టు అంటూ కొత్త రకం ప్రచారంతో బాగానే జనాల్లోకి దూసుకుపోయారు ‘వర్జిన్ బాయ్స్’ మూవీ టీం. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్ లాంటి చాలా సిటీస్‌లో టికెట్ కొన్న ప్రేక్షకులకు లాటరీలో డబ్బులు కూడా ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో ఓ ప్రేక్షకుడికి ఐఫోన్ కూడా ఇచ్చారు. సినిమా తీసిన తర్వాత తమదైన తీరులో మూవీ టీం ప్రచారం చేయడంతో ప్రచారం బాగా జరిగింది. ఈ సినిమాలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జర్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు ఈ సినిమాకు రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించగా.. కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం దయానంద్ చూసుకున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాటోగ్రఫర్‌గా వెంకట ప్రసాద్ తన కెమెరా పనితనాన్ని చూపించారు. కాగా ‘వర్జిన్ బాయ్స్’ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రాబట్టుకుంది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..