BJP on BC Reservation Bill: మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బిజెపి(BJP వ్యతిరేకిస్తుందని బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. ముస్లీంలను తొలగించి బిసి(BC)లకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తే మద్దతిస్తామిన తెలిపారు. బిసి సంఘాలు రాజకీయాలు పక్కన పెట్టి మీకు అన్యాయం జరుగుతుందా లేదా అని ఆలోచించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంకు రెండు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమిన, తెలంగాణ(Telangana) రాష్ట్రంకు జరిగే నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం గట్టి వాదనను వినిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన మోదీ(Modi) కానుక సైకిల్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
Also Read: MLC Kavitha: కవిత కయ్యాలపై కీలక భేటీ.. జాగృతిపైనే ప్రధానంగా చర్చ!
బీసీలకు 27 శాతం రిజర్వేషన్
అనంతరం మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బిసి(BC)లకు నష్టం చేసే కుట్ర దాగి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత కుట్ర జరుగుతున్న బిసి సంఘాలు కొన్ని మాట్లాడక పోవడంతో బిసిలు నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో బిసి(BC) గణనలో బిసి జనాభాను 5 శాతం తగ్గించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తుంది, ముస్లింలు పోగా బిసిలకు 32 శాతం వర్తిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు బిసిలకు కేవలం ఐదు శాతం రిజర్వేషన్ పెంచుతుందన్నారు.
కాంగ్రెస్(Congress) పార్టీ ప్రభుత్వం ముస్లీం రిజిస్ట్రేషన్‌ల గూర్చే ఆలోచిస్తుందని, టిఆర్ఎస్(BRS) కాంగ్రెస్‌లు(Congress) మైనారిటీ ఓట్ల కోసం పాటు పడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీకి బిఆర్ఎస్(BRS) పార్టీ వత్తాసు పలుకుతుందని బండిసంజయ్ అన్నారు.
Also Read: CM Revanth Reddy: పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన రేషన్ కార్డులెన్ని? సీఎం సంచలన వ్యాఖ్యలు..