CM Revanth Reddy: పదేళ్లు కేసీఆర్ మోసం తప్ప ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు. తుంగతుర్తి మండలం తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల (New Ration cords) పంపిణీ కార్యక్రమం జరిగింది. సీఎం పాల్గొని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉండాలని సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం అని, తుంగతుర్తి గడ్డకు గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. నల్గొండ చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదని వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, మూసీ ప్రాజెక్ట్ కట్టి నల్గొండ రైతులకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
బీఆర్ఎస్ ఏం చేసింది?
‘‘కేసీఆర్ (KCR) ఉంటే గోదావరి జలాలు మూడు రోజుల్లో తీసుకు వస్తానని ఒకరు అంటున్నారు. గ్లాస్‌లో సోడా కాదు జలాలు తీసుకురావడానికి. పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఎందుకు తీసుకురాలేదు. సొంత మండలానికి ఎమ్మార్వో ఆఫీస్ తీసుకురాని వ్యక్తి మమల్ని అంటారా. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు. పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలని ఎందుకు అనుకోలేదు’’ అంటూ బీఆర్ఎస్‌పై సీఎం ఫైరయ్యారు. త ప్రభుత్వం మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నదని, బీఆర్ఎస్ (BRS) హయాంలో గ్రామాల్లో బెల్టు షాపులు ఉంటే ప్రజా ప్రభుత్వంలో సన్నబియ్యం కోసం జనం బారులు తీరుతున్నారని అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు.
Also Read: Gadwal: చెక్కింగ్ సిబ్బంది లేకపోవడమే.. అక్రమ దందాలకు ప్రోత్సాహమా?
అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యం
రైతులకు 500 రూపాయల బోనస్, సన్నబియ్యం, రైతు భరోసా, రైతు రుణ మాఫీ లాంటి పథకాలు ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యం అయ్యాయని సీఎం వివరించారు. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి చూపించామన్నారు. రైతు భరోసా ఇవ్వమని బీఆర్ఎస్ ప్రచారం చేసిందని, కానీ 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. ‘‘వ్యవసాయం దండుగ కాదు పండుగ చేశాం. 2.85 లక్షల ధ్యానం పండించి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచాం. రైతులు సంతోషంగా ఉంటేనే ఇందిరమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుంది. సోనియమ్మ కల నెరవేరుతుంది.
కొత్తగా 5.6 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేశాం. 26 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులలో (New Ration cords) నమోదు చేశాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేశాం. 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 2 చీరలు పంపిణీ చేయబోతున్నాం. స్వయం సహాయక సంఘాల గ్రూపులకు రూ.21 వేల కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందుకోసం 6,500 కోట్ల రూపాయల ఖర్చు చేశాం. మహిళా సంఘాలకు బస్సులు కొనిస్తున్నాం. పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. సోలార్ పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయించి 1000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంటున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ప్రభుత్వ స్కూల్స్ బాగు చేయించాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే రికార్డ్ సృష్టించాం. 2 ఏళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం’’ అని రేవంత్ రెడ్డి వివరించారు.
కేసీఆర్‌ను ఉరి తీసినా తప్పులేదు
కేసీఆర్ (KCR) లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలేశ్వరం అయిందన్నారు సీఎం. 60 ఏళ్లలో కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ, జూరాల లాంటి ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, కాళేశ్వరం ఎలా ఉందో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. కాళేశ్వరం దగ్గర కేసీఆర్‌ను ఉరి తీసినా పాపం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని, తుంగతుర్తికి గోదావరి జలాలు తీసుకువచ్చి తీరుతామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో ఒక గంజాయి మొక్క ఉందని, వచ్చే ఎన్నికల్లో పీకేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించే బాధ్యత తమదని, ఆ ఎన్నికల్లో గొప్ప మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న రేవంత్, తెలంగాణ గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతామని, దేశంలోనే మొదటగా ఎస్సీ వర్గీకరణ చేశామని వివరించారు వందేళ్ల తర్వాత కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. మోదీ మెడలు వంచి జనగణనలో కులగణన చేపట్టేలా చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలిపిస్తున్నామని చెప్పారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించేలా కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: Lashkar Bonalu: లష్కర్ రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి