Gadwal( image credit: swetcha reporter)
మహబూబ్ నగర్

Gadwal: చెక్కింగ్ సిబ్బంది లేకపోవడమే.. అక్రమ దందాలకు ప్రోత్సాహమా?

Gadwal: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పీడీఎస్ బియ్యం, వరి ధాన్యం తరలిస్తున్నట్లు అనుమానంతో స్థానికులు వాహనాలను అడ్డుకోబోయారు.  తెల్లవారుజామున నందిన్నె చెక్ పోస్టులో చోటు చేసుకుంది. కేటిదొడ్డి మండలంలో ఓ రైస్ మిల్లు నుంచి రాయచూరుకు (Raichur) వడ్లు, పీడిఎస్ బియ్యం (PDS Rice) లోడ్ తో వాహనాలు రాయచూర్ కు అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు సమాచారం అందింది. ఈ క్రమంలో నందిన్నె చెక్ పోస్టు వద్ద పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

 Also ReadMedical College Vacancies: సీనియారిటీ ఆధారంగా సిటీలో పోస్టింగ్ ఛాన్స్.. సర్కార్ స్టడీ

పోలీస్‌ల నిఘా కరువైంది

సిబ్బంది ఒకరే ఉండటంతో స్థానికులు వాహహానాలను ఆపడానికి ప్రయత్నించారు. డ్రైవర్ లు వాహనాలను స్థానికులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు‌ దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పక్కకు తప్పుకోవడం జరిగింది. పీడీఎస్ బియ్యం లారీ తప్పించకుని రాయచూర్ కు వెళ్లింది. వడ్ల లోడ్ లారీని తిరిగి మండలంలోని ఓ రైస్ మిల్లుకు తరలించినట్లు సమాచారం. రాత్రి పూట వరిధాన్యం, పీడీఎస్ బియ్యం అక్రమంగా రాయచూర్ కు తరలిస్తున్నా నందిన్నె చెక్ పోస్టులో పోలీస్‌‌ల నిఘా కరువైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా నందిన్నె చెక్ పోస్టులో సీసీ కెమెరాలు పని చేయకపోవడం కొసమెరుపు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయకపోవడంతో అనేక వాహనాలు ఈ మార్గం గుండా వెళుతున్నాయి. ప్రభుత్వం ఆహార భద్రత పథకంలో భాగంగా లబ్ధిదారులకు సన్న బియ్యం పథకానికి ముందు జిల్లాలో కొందరు అక్రమ దందా దారులు పి.డి.ఎస్ బియ్యం సేకరించి వివిధ మార్గాలలో రాయచూర్ కి తరలిస్తూ సొమ్ము చేసుకున్నారు.

సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ లోకపోవడంతో

అంతేకాకుండా జిల్లాలోని రైస్ మిల్లులకు సివిల్ సప్లయ్ అధికారులు రబీలో పండించిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు ఇండెంట్ మేరకు కేటాయించారు. ఈ మేరకు రైతుల నుంచి వరి ధాన్యాన్ని మిల్లులకు తరలింపు ప్రక్రియ పూర్తయింది. మిల్లులో వాటి నిల్వలు,పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది.

 Also Read: Lashkar Bonalu: లష్కర్ రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?