Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె డ్యాన్స్, గ్లామర్, ఎనర్జీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డ్యాన్సింగ్ స్కిల్స్ విషయంలో ఆమెకు తిరుగులేదనే చెప్పాలి. అయితే, వరుసగా ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, ఆదికేశవ, రాబిన్‌హుడ్, జూనియర్, గుంటూరు కారం’ వంటి చిత్రాలతో పాటు, ఇటీవల విడుదలైన ‘మాస్ జాతర’ (Mass Jathara) సైతం అంచనాలను అందుకోలేకపోయాయి. వీటిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) పరవాలేదనిపించినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం పరాజయాన్నే చవిచూసింది. దీంతో శ్రీలీల ఖాతాలో వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్‌లు నమోదయ్యాయి. ఈ వరుస పరాజయాలు ఆమె కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేశాయనే అభిప్రాయం విమర్శకుల్లో సైతం వ్యక్తమవుతోంది. ఈ పరాభవాల నుంచి ఆమె ఎలా బయటపడుతుందో? అని ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.
Also Read- Dheekshith Shetty: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో ఎందుకు చేశానంటే..?
పవర్ స్టారే కాపాడాలి..
శ్రీలీల కేవలం పాటలకే పరిమితమవుతోందని, కథల ఎంపికలో దృష్టి పెట్టడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎంత మంచి డ్యాన్సర్ అయినా, ఎంత గ్లామర్ ఉన్నా… హిట్‌లు లేకపోతే ఇండస్ట్రీలో నిలబడటం కష్టం. ఈ చేదు నిజాన్ని శ్రీలీల కూడా గ్రహించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాపైనే ఉన్నాయి. ఇది ఆమె చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన కాంబో కావడంతో.. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా తనకు సక్సెస్‌ని ఇస్తుందని శ్రీలీల బలంగా నమ్ముతోంది. ఈ సినిమా విజయం ఆమె కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే, ‘గబ్బర్ సింగ్’ సినిమాకు ముందు శృతి హాసన్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేసింది. కానీ, ఆ సినిమాతో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ పడటంతో.. అప్పటి వరకు ఆమె పరాజయాల బాటకు తెరపడింది. ఇప్పుడు శ్రీలీల విషయంలో కూడా ఆమె అభిమానులు అదే జరగాలని కోరుకుంటున్నారు.
Also Read- Shyamala Devi: ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్‌పై ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు
ఇప్పుడు శ్రీలీల ఏం చేయాలి?
విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ‘మాస్ జాతర’ సినిమా ఫలితం తర్వాత శ్రీలీల తన కెరీర్ పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం భారీ సినిమాల్లో గ్లామర్ డాల్‌గా కాకుండా, ప్రాధాన్యత ఉన్న పాత్రలు (Performance Oriented Roles) ఎంచుకోవాలి. కథ, పాత్ర గురించి పూర్తిగా తెలుసుకుని సినిమాలు ఒప్పుకోవాలి. డ్యాన్స్‌తో పాటు నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రల్లో నటించినప్పుడే ఆమె టాలీవుడ్‌లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగగలదు.. లేదంటే, టాలీవుడ్‌లో శ్రీలీల మనుగడ కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆమెకు బ్రేక్ ఇస్తుందో లేదో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి. చూద్దాం.. శ్రీలీల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
