Dheekshith Shetty: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (National Crush Rashmika Mandanna), ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) జంటగా నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) తెరకెక్కించారు. సరికొత్త ప్రేమ కథగా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. నవంబర్ 7న తెలుగు, హిందీ తెలుగులో.. నవంబర్ 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న ఈ చిత్ర విశేషాలను హీరో దీక్షిత్ శెట్టి మీడియాకు తెలియజేశారు.
Also Read- Shyamala Devi: ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్‌పై ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు
మిస్ చేయకూడదని అనుకున్నా
ఈ సందర్భంగా దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. ‘‘నానితో చేసిన ‘దసరా’ తర్వాత వచ్చిన అవకాశమిది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నన్ను కలిసి.. రష్మిక హీరోయిన్‌గా చేస్తున్న సినిమాలో నిన్ను బాయ్ ఫ్రెండ్ రోల్ కోసం అనుకుంటున్నామని చెప్పి, ఆ తర్వాత స్క్రిప్ట్ పంపించారు. స్క్రిప్ట్ చదివాక ఆ పాత్రకు ఎందుకు నన్ను అనుకుంటున్నారనేది నాకు అర్థమైంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి స్క్రిప్ట్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే ఈ సినిమాను మిస్ చేయకూడదని అనుకున్నాను. ఈ సినిమాలో విక్రమ్ పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్ర ఎలా ఉండాలో దర్శకుడు రాహుల్‌కు పూర్తి క్లారిటీ ఉంది. విక్రమ్ ఎలా ఉంటాడు? అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఎలా మాట్లాడుతాడు? అనేది రాహుల్ వివరంగా చెప్పేవారు. ఆయనకు ఉన్న క్లారిటీతో ఆ పాత్ర చేయడం నాకు చాలా ఈజీ అయ్యింది. విక్రమ్ పాత్రలో ఏదో నెగిటివ్ ఉంది, ఇతను టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అనే ఇంప్రెషన్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు.. విక్రమ్ నెగిటివ్ పాత్ర అని ఎప్పుడూ ఫీల్ కావొద్దని రాహుల్ చెప్పేవారు. నేను స్టేజ్, ఫిలిం స్కూల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి విక్రమ్ పాత్రకు ఎలా సన్నద్ధమవ్వాలో అలా అయ్యాను. నేను ఏ సినిమా చేసినా.. స్క్రిప్ట్ నాకు పర్సనల్‌గా నచ్చితేనే చేస్తాను.
Also Read- Bigg Boss Telugu 9: తనూజ ఏం మారలే.. అవే అరుపులు.. నిజంగా బిగ్ బాస్ సపోర్ట్ ఉందా?
నెక్ట్స్ మూవీకి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు
‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి కథ ఇప్పటి వరకు ఉన్న, వచ్చిన ప్రేమకథలకు విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ చూడటానికి బాగుంటాయి కానీ వాటిని మన రియల్ లైఫ్‌తో రిలేట్ చేసుకోలేం. ఈ సినిమాలోని పాత్రలు, సందర్భాలు మనం మన లైఫ్‌లో రిలేట్ చేసుకునేలా ఉంటాయని కచ్చితంగా చెప్పగలను. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల యూత్ ఈ సినిమాను చూస్తే తమ లైఫ్‌లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు. రష్మిక తప్ప మరొకరు ఈ సినిమాకు న్యాయం చేయలేరేమో అనేంత గొప్పగా ఆమె ఇందులో నటించింది. సినిమాలో రష్మిక కనిపించదు. భూమానే కనిపిస్తుంది. ఈ సినిమా యూత్ కోసమే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే మంచి పాత్రలు ఇందులో ఉన్నాయి. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అంటే.. స్మోకింగ్, డ్రింకింగ్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. సినిమాల్లో ఇలాంటివే చూస్తుంటాం. కానీ, టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అంటే వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు.. అలాంటి ఒక ఎలిమెంట్‌ని ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమాలో నా నటనను చూసిన అల్లు అరవింద్ సార్.. అప్రిషియేట్ చేసి నెక్ట్స్ మూవీకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నిజంగా ఈ చర్య.. కెరీర్ బిగినింగ్‌లో ఉన్న నాలాంటి యాక్టర్‌కు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
