Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 56 (Bigg Boss Telugu Season 9 Day 56) ఆదివారం ఎపిసోడ్, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, ఎలిమినేషన్స్ టాస్క్‌లతో మంచి థ్రిల్లింగ్ ఇచ్చింది. ఈ సండే ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా బిగ్ బాస్ ప్రోమోలను విడుదల చేశారు. ఈ ప్రోమోలు చూస్తే.. ఈ షో మిస్ అవకూడదనే ఫీల్‌ని ఇస్తున్నాయంటే.. ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా ప్రోమో 1 విషయానికి వస్తే.. ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ వచ్చిన ఈ ప్రోమోలో.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), తన సహ నటుడు ధీక్షిత్ శెట్టితో కలిసి ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) ప్రొమోషన్స్‌కు వచ్చారు. ‘రష్మికలా వచ్చావా? గర్ల్ ఫ్రెండ్‌లా వచ్చావా?’ అని నాగ్ (King Nagarjuna) అడితే.. ‘రష్మికలా వచ్చాను, అదే టైమ్‌లో నన్ను గర్ల్ ఫ్రెండ్‌గా ఎవరెవరు ఊహించుకుంటున్నారో వారి కోసం కూడా వచ్చాను’ అని రష్మిక చెప్పారు. వెంటనే హౌస్‌మేట్స్‌కి పరిచయం చేసి.. ‘మీ ముందు నేషనల్ క్రష్మిక ఉంది. మీ పెర్ఫార్మెన్స్‌ని జడ్జి చేస్తుంది. మీకు ఇప్పుడో క్లిప్ చూపిస్తా.. దానిని రీ క్రియేట్ చేయాలి’ అని చెప్పగానే.. కొన్ని సీన్స్‌ని హౌస్‌మేట్స్ రీ క్రియేట్ చేస్తూ.. ఫన్ జనరేట్ చేస్తున్నారు. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ అనే హింట్‌ని ఈ ప్రోమోతో అందించారు.
Also Read- Telugu Indian Idol Season 4: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 విన్నర్ ఎవరంటే?
తనూజకు నాగ్ క్లాస్..
‘కింగ్ టైమ్’ అంటూ వచ్చిన రెండో ప్రోమోలో తనూజకు నాగ్ తలంటేస్తున్నారు. ‘వీక్‌లో ఎన్ని రోజులు ఉంటాయి తనూజ’ అనగానే ‘7రోజులు సార్’ అని తనూజ చెప్పింది. ‘డేలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, టు టీ టైమ్స్.. మొత్తం 5. వారానికి వచ్చేసి 35 టైమ్స్. మొత్తం ఈ లాస్ట్ వీక్‌లో 35 సార్లు నువ్వు హౌస్‌మేట్స్‌తో గొడవపడ్డావ్. ప్రాబ్లమ్ నువ్వా? హౌస్‌మేట్స్ అందరూనా?’ అని నాగ్ ప్రశ్నించారు. ‘నాతో కలిపి అందరిలోనూ ఉంది సార్.. అయినా నేను ఫస్టే చెప్పాను సార్.. నాకు కిచెన్ డిపార్ట్‌మెంట్ వద్దూ అని. ఎందుకంటే, నేను అక్కడికి వెళితే.. వాంటెడ్‌గానే కొందరు టార్గెట్ చేస్తారు సార్’ అని తనూజ వివరణ ఇచ్చింది. దీనిపై ఇమ్ముని నాగ్ ప్రశ్నిస్తున్నారు. ‘ఒక రోల్ మనం ఒప్పుకున్న తర్వాత నెంబర్ వన్.. ఓర్పు చాలా ముఖ్యం. నెంబర్ 2.. మాట్లాడే విధానం.. అండ్ ఫీడ్ బ్యాక్. స్పెషల్లీ ఫీడ్ బ్యాక్ తీసుకోవడం మరిచిపోతే.. జీవితంలో మార్పు రాదు’ అంటూ తనూజకు నాగ్ క్లాస్ ఇస్తున్నారు.
Also Read- Prasanth Varma: రెండు వైపులా విషయం తెలుసుకోండి.. మీడియా సంస్థలపై చురకలు!
తనూజ చేతికి గోల్డెన్ బజర్..
ఎలిమినేషన్ డే అంటూ వచ్చిన మూడో ప్రోమోలో.. ‘ఈ హౌస్‌లో ప్రతి హౌస్‌మేట్‌కి ఎవరు పాయిజనో చెప్పి.. ఇంజక్షన్‌లో ఉన్న లిక్విడ్‌ని తాగించాలి’ అని నాగార్జున సూచించారు. సుమన్ శెట్టి – గౌరవ్‌కి, దివ్య- భరణికి, తనూజ- ఇమ్ముకి.. ఇంజక్షన్ ఇచ్చి వివరణ ఇస్తున్నారు. ‘బాటమ్ 2లో ఉన్న వారు బయట కారులోకి వచ్చి కూర్చోండి’ అని చెప్పగానే బాటమ్ 2లో ఉన్న గౌరవ్, మాధురి కళ్లకు గంతలు కట్టి.. కారులో కూర్చోబెట్టి.. గార్డెన్ నుంచి బయటకు పంపించి డోర్ క్లోజ్ చేశారు. ఈ ఇద్దరిలో లిస్ట్ ఓటింగ్ ఉన్న వారు ఎలిమినేట్ అవుతారు, ఇంకొకరు సేవై లోపలికి వస్తారని నాగ్ చెబుతున్నారు. వెంటనే తనూజను పిలిచి.. ‘తనూజ నీ ఎదురుగా ఉంది గోల్డెన్ బజర్. దానికి ఒక సేవింగ్ పవర్ ఉంది. అది నువ్వు ఈ వారం వాడవచ్చు. తర్వాత ఏ వారం అయినా వాడవచ్చు. అది ఈ వారం యూజ్ చేస్తావా? లేదా? అనేది ఆలోచించి నాకు చెప్పాలి’ అని ఆమెకు నాగ్ పరీక్ష పెట్టారు. ఏం జరిగింది? అనేది మాత్రం వెల్లడి చేయలేదు. తనూజ ఆలోచనలో ఉంది. ఈ ప్రోమో ముగిసింది. అసలేం జరిగిందో తెలియాలంటే మాత్రం.. నైట్ షో చూడాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
