Mysterious Movie: సస్పెన్స్ త్రిల్లర్ సినిమాను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడతారు. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో, అశ్లీ క్రియేషన్స్ పతాకంపై జయ్ వల్లందాస్ (USA) నిర్మించిన “మిస్టీరియస్” చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 థియేటర్లలో విడుదల కానుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ, “మిస్టీరియస్” ఒక కొత్త స్క్రీన్ ప్లేతో, పూర్తిగా సస్పెన్స్ ప్రధానంగా నడిచే థ్రిల్లర్ అని తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుందని, ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
Read also-Malavika Mohanan: స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఉండదు.. కానీ ‘రాజా సాబ్’లో!
నిర్మాత జయ్ వల్లందాస్ సినిమా విడుదల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని తెలియజేశారు. సహ నిర్మాతలు ఉషా, శివానీ మాట్లాడుతూ, తాము ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అత్యంత నాణ్యతతో నిర్మించామని తెలిపారు. చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి లభించిన అద్భుతమైన స్పందన పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రోహిత్, మేఘన రాజపుట్, అభిద్ భూషణ్, రియా కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ నటుడు బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆకునూరి గౌతమ్, అలాగే జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ నవీన్, లక్కీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Read also-Puri Jagannadh: పూరీ సార్.. షూటింగ్ కూడా పూర్తయింది.. ఇకనైనా టైటిల్ చెప్పండి!
“మిస్టీరియస్” చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను మహి కోమటిరెడ్డి నిర్వహించారు. ఈ చిత్రానికి ML రాజా పాటలు, సంగీతాన్ని అందించగా, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనులను పరవస్తు దేవేంద్ర సూరి (దేవా) చూసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రామ్ ఉప్పు వ్యవహరించగా, చిత్ర పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీ ఆర్వో)గా శ్రీపాల్ చోల్లేటి ఉన్నారు. మంచి సాంకేతిక విలువలతో, ఉత్కంఠభరితమైన కథనంతో వస్తున్న “మిస్టీరియస్” సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

