Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ఆసక్తికర పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘#పూరిసేతుపతి’ (PuriSethupathi) చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు రోజున.. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి, నిర్మాత చార్మీ కౌర్‌ల మధ్య జరిగిన ఉద్వేగభరిత క్షణాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జెబి మోషన్ పిక్చర్స్‌కు చెందిన జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. టబు, దునియా విజయ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
Also Read- Anaganaga Oka Raju: జాన్ జిగ్రీస్ అంటూ నవీన్ పోలిశెట్టి మరో వీడియో.. సాలిడ్ అప్డేట్ ఇచ్చాడుగా!
టైటిల్ ఏంటి?
చిత్ర యూనిట్ అధికారికంగా షూటింగ్ మొత్తం పూర్తయిందని ప్రకటించినప్పటికీ, సినిమా టైటిల్‌ను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ విషయంలో చిత్ర బృందం కొనసాగిస్తున్న గోప్యత అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ‘బెగ్గర్’, ‘భవతీ భిక్షాందేహి’ వంటి కొన్ని ఊహాజనిత టైటిల్స్ వైరల్ అవుతున్నా, అవేవీ అధికారికం కావు. ఈ చిత్ర టైటిల్ లాంచ్ కోసం గతంలో చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావించినా, అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అప్పటి నుంచి టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. డైరెక్టర్ పూరి జగన్నాథ్.. విలక్షణమైన, పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టడంలో దిట్ట. ఆ విషయం అందరికీ తెలిసిందే. గతంలో ‘ఇడియట్, పోకిరి, టెంపర్, ఇస్మార్ట్ శంకర్’ వంటి వైవిధ్యభరిత టైటిల్స్‌తో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Also Read- Bigg Boss Telugu 9: సంజనకు సుమన్ శెట్టి కిస్.. హౌస్‌లో కొత్త ప్రేమ జంటలు..!
పడటం, లేవడం ఆయనకు అలవాటే..
అందుకే, ఇప్పుడు షూటింగ్ కూడా పూర్తయిన నేపథ్యంలో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్‌ను త్వరగా ప్రకటించాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పూరి జగన్నాథ్‌ను అభ్యర్థిస్తున్నారు. పూరి జగన్నాథ్ శైలిలో ఈ పాన్-ఇండియా సినిమాకు ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమా సక్సెస్ కావడం పూరీకి ఎంతో కీలకం. ఒక సాలిడ్ హిట్ పడితేనే మళ్లీ ఆయన కమ్ బ్యాక్ అవగలరు. అయితే ఇది పూరికేం కొత్త కాదు.. పడటం, లేవడం ఆయనకు తెలిసిందే. కాబట్టి, కచ్చితంగా ఈ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, మళ్లీ తనేంటో చూపిస్తాడని ఆయన అభిమానులు నమ్ముతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

