Prabhas Pro : ఈ మధ్య కాలంలో ఏవి నమ్మాలో? ఏవి నమ్మకూడదో అసలు అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యేవన్నీ నిజాలే అని చెప్పలేము.. అలాగే అబద్దాలని కూడా చెప్పలేము. ఎందుకంటే, ప్రస్తుతం దేనినైనా మాయ చేసే టెక్నాలజీ నడుస్తుంది. ముఖ్యంగా, సెలబ్రిటీలు చాలా ఫేస్ చేస్తున్నారు. నిజం తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు చెప్పి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తుంటారు. జనాలు కూడా ఇదే నిజమే అని నమ్ముతారు. తాజాగా, అలాంటి ఓ ఘటన కలకలం రేపుతోంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యూట్యూబర్ హీరో ప్రభాస్ పీఆర్ఓ ( Prabhas Pro ) తనకు కాల్ చేసి బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. విజయ సాధు మార్చి 4వ తేదీన ప్రభాస్‌కు సర్జరీ అయిందంటూ వీడియో అప్లోడ్ చేశాడు. అయితే, అతను ఆ యూట్యూబర్ కు కాల్ చేసి నా పేరు సురేష్, ప్రభాస్ పీఆర్ఓ ను మాట్లాడుతున్నాను అంటూ పోస్ట్ చేసిన వీడియోలు డిలీట్ చేయాలని మండిపడ్డాడు. కానీ, ఆ యూట్యూబర్ లైట్ తీసుకుని ఒక్కటి కూడా డిలీట్ చేయలేదు. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ కు పీఆర్ ఆ లింక్ ను షేర్ చేశాడు.
Also Read: Ugadi 2025: ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్.. వీరికి గుడ్ టైమ్.. మీ రాశి ఎందులో ఉంది?
ఇక అభిమానులు కూడా బెదిరించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే యూట్యూబర్ విజయ్ పోలీసుల వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. ఇదిలా ఉండగా గత కొద్దీ రోజుల నుంచి ప్రభాస్ హెల్త్ అస్సలు బాలేదంటూ పలు వీడియోలు వస్తున్నాయి. అతని కండిషన్ ఇది వరకు కంటే.. దారుణంగా ఉందంటూ.. పోస్ట్ చేసిన వీడియోలపై వివాదాలు తలెత్తాయి. ఓ వైపు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అలాగే, భారీ మార్కెట్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ సూపర్ స్టార్ల కంటే ప్రభాస్ ఒక్క సినిమా చేస్తే కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది.
ఇలాంటి సమయంలో ప్రభాస్ కు హెల్త్ బాలేదంటూ వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజం తెలుసుకోకుండా ఇలాంటివి ఎలా పోస్ట్ చేస్తారంటూ సినీ వర్గాల వారు కూడా మండిపడుతున్నారు. అంతే కాదు, ఈ మధ్య జ్యోతిష్యులు కూడా అతని హెల్త్ కండిషన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇన్నేళ్ల సినీ కెరీర్లో చిన్న మచ్చ లేకుండా రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకు వెళ్తుంటే .. హెల్త్ కండిషన్ బాగోలేదనే పోస్టులతో చెరగని ముద్ర వేశారు.
ప్రభాస్ కల్కి ( Kalki 2898 AD ) చిత్రంతో వెయ్యి కోట్ల బిజినెస్ తన అకౌంట్ లోకి వేసుకున్నాడు. సమ్మర్ లో ” రాజాసాబ్ ” ( The Raja Saab ) మూవీతో మన ముందుకు రానున్నాడు. ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా థియేటర్లలో సందడీ చేయనుంది. కాగా, ప్రభాస్ సర్జరీ చేయించుకున్నట్లు కూడా గాసిప్స్ వస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.