Pastor Praveen Pagadala (Image Source: Twitter)
క్రైమ్

Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీని తేల్చేసిన పోలీసులు.. వెలుగులోకి సంచలన నిజాలు!

Pastor Praveen Pagadala: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతి కేసు ఏపీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తొలుత ప్రవీణ్ ది యాక్సిడెంట్ గా భావించిన కుటుంబ సభ్యులు.. శరీరంపై గాయాలు చూసి హత్యగా అనుమానం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి వెనక నిజానిజాలు తేల్చాలని బంధువులు, అనుచరులు, క్రైస్తవ సంఘాలు ఆందోళన బాట పట్టడంతో ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత జగన్ (YS Jagan Mohan Reddy), కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సైతం స్పందించడంతో పాస్టర్ మృతి కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలో తాజాగా పాస్టర్ మృతిపై మీడియాతో ముచ్చటించిన ఏలూర్ రేంజ్ డీఐజీ.. సంచలన విషయాలు వెల్లడించారు.

డీఐజీ ఏమన్నారంటే?
పాస్టర్ ప్రవీణ్ మార్చి 24న ఉదయం హైదరాబాద్ నుంచి బైక్ పైన పయనమైనట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ (DIG Ashok Kumar) తెలిపారు. పాస్టర్ పోస్టుమార్టం మెుత్తం ఓ వీడియోలో రికార్డు చేసినట్లు తెలిపారు. ఆయన శరీరంపై రాపిడి గాయాలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారని అన్నారు. ఈ కేసులో ఎటువంటి అనుమానాలకు తావులేదని డీఐజీ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Also Read: CM Revanth Reddy: చిట్టీ రాస్తే చాలు.. క్షణాల్లో అన్నీ ముందుకు.. సీఎం రేవంత్

‘ఆధారాలుంటే ఇవ్వండి’
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఎవరికైనా అనుమానాలు, ఆధారాలు ఉంటే తమకు తెలియజేయాలని డీఐజీ అశోక్ కుమార్ సూచించారు. అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత విజయవాడలో ప్రవీణ్ ఆగారని డీఐజీ తెలిపారు. నాలుగు గంటల పాటు అక్కడే ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఎవరిని కలిశారో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Also Read This: Alexandra Hildebrandt: ఈ బామ్మతో అంత ఈజీ కాదు.. తొలి బిడ్డకు 46 ఏళ్లు.. ప్రస్తుతం పదో బిడ్డకు జన్మ

ఎస్పీ ఏమన్నారంటే
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ సైతం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం వరకూ ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ లను తీసుకున్నట్లు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ బైక్ ను క్రాస్ చేసి అనుమానస్పదంగా అనిపించిన 4 కార్లను ట్రేస్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. అయితే ఆ కార్ల యజమానులకు పాస్టర్ ప్రవీణ్ మృతికి ఎటువంటి సంబంధం లేదని ఎస్పీ చెప్పారు.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్