Alexandra Hildebrandt: ఈ బామ్మతో అంత ఈజీ కాదు.. తొలి బిడ్డకు 46 ఏళ్లు.. ప్రస్తుతం పదో బిడ్డకు జన్మ | Alexandra Hildebrandt: ఈ బామ్మతో అంత ఈజీకాదు
Alexandra Hildebrandt (Image Source: Canva)
Viral News

Alexandra Hildebrandt: ఈ బామ్మతో అంత ఈజీ కాదు.. తొలి బిడ్డకు 46 ఏళ్లు.. ప్రస్తుతం పదో బిడ్డకు జన్మ

Alexandra Hildebrandt: ఆడవారికి అమ్మతనానికి మించిన వరం మరోటి లేదంటారు. తొలిసారి పండంటి బిడ్డకు జన్మనిస్తే ఆ స్త్రీ ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండోసారి తల్లి అయినా అంతే ఆనందం, అదే సంతోషం. అదే పదోసారి ఓ బిడ్డకు జన్మనిస్తే? అది కూడా యువతి కాకుండా 66 ఏళ్ల బామ్మ అయితే? చదవటానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. ఓ బామ్మ ఏకంగా పదోసారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.  ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లి బిడ్డ క్షేమం
జర్మనీకి చెందిన 66 ఏళ్ల అలెగ్జాండ్రా హిల్డిబ్రాండ్ట్ (Alexandra Hildebrandt).. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మించింది. అయితే ఆమె గతంలోనే 9 మందికి జన్మనివ్వడం ఆసక్తికరం. తాజాగా పుట్టిన బిడ్డకు ఫిలిప్ గా అలెగ్జాండ్రా నామకరణం చేసింది. తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాబు బరువు 7 పౌండ్ల 13 ఔన్సులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఐవీఎఫ్, ఫెర్టిలిటీ డ్రగ్స్ ప్రమేయం లేకుండానే అలెగ్జాండ్రా.. సహజసిద్ధంగా బిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యులు స్పష్టం చేశారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
66 ఏళ్ల వయసులో పదో బిడ్డకు జన్మనివ్వడంతో అలెగ్జాండ్రా పేరు సోషల్ మీడియాలో ఒక్కసారిగా మార్మోగిపోయింది. దీంతో జర్మనీకి చెందిన ఓ మీడియా ఆమెను ఇంటర్వ్యూ చేయగా.. అలెగ్జాండ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికీ 35 ఏళ్ల యువతిగా ఫీల్ అవుతున్నట్లు ఆమె తెలిపారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లే ఇదంతా సాధ్యమైందని ఆమె తెలిపారు. తాను ప్రతీరోజు గంట పాటు స్విమ్ చేస్తానని, సిగరేటు – మందు వంటి వాటికి దురలవాట్లకు ఉంటానని ఇంటర్వ్యూలో అలెగ్జాండ్రా తెలిపారు.

Also Read: TG Govt on B-Tech: మీరు బిటెక్ ఫెయిలయ్యారా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే!

తొలి బిడ్డ వయసు 46 ఏళ్లు
అలెగ్జాండ్రా హిల్డిబ్రాండ్ట్ సంతానం విషయానికి వస్తే ఆమె తొలి సంతానం వయసు 46 సంవత్సరాలు. 9వ బిడ్డ ఏజ్ 2 ఏళ్లుగా ఉంది. అంటే రెండేళ్ల క్రితమే ఆమె బిడ్డకు జన్మనిచ్చి.. తాజాగా మరోమారు మగ బిడ్డను ప్రసవించడం విశేషం. సాధారణంగా 30 ఏళ్లు దాటిన తర్వాత స్త్రీలు పిల్లలను కనాలంటే శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. 45-55 మధ్య గర్భం దాల్చాలంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అటువంటిది 66ఏళ్లకు అలెగ్జాండ్రా బిడ్డను కనడమంటే సాధారణ విషయం కాదని వైద్యులు అంటున్నారు.

Also Read This: MS Dhoni: ‘ధోని.. ఏంటయ్యా ఇలా చేశావ్’.. సీఎస్కే ఫ్యాన్స్ గరం గరం!

గతంలోనూ ఇలాగే
డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సంస్థ డేటా ప్రకారం 2022లో 50 ఏళ్లకు పైబడిన స్త్రీలు.. 1,230 మందికి జన్మనిచ్చారు. అంతకు ముందు ఏడాది అంటే 2021లో ఈ సంఖ్య 1,041గా ఉంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం చైనాకు చెందిన 51 ఏళ్ల మహిళ ‘ఎమ్’.. ఏకంగా కవలలకు జన్మనిచ్చింది. 2019లో చైనాకు చెందిన మరో 67 ఏళ్ల మహిళ సైతం ఆడపిల్లకు జన్మనిచ్చింది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?