MS Dhoni: ప్రస్తుతం ఐపీఎల్ – 2025 (IPL 2025) సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. విజయం కోసం నువ్వా – నేనా అన్న స్థాయిలో ఆటగాళ్లు తలపడుతున్నారు. ఇటీవలే సీజన్ మెుదలైనప్పటికీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానమే లక్ష్యంగా జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ షెడ్యూల్ (IPL Schedule) ప్రకటించినప్పటి నుంచే ఈ మ్యాచ్ పై అంచనాలు ఉండగా హోమ్ గ్రౌండ్ లో చెన్నై (Chennai)లో దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో స్టార్ క్రికెటర్ ధోనిపై ఎన్నడూ లేని స్థాయిలో నెట్టింట విమర్శలు మెుదలయ్యాయి. మాజీలు సైతం ధోని (MS Dhoni)పై ఫైర్ అవుతున్నారు. ఫ్యాన్స్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతలా ధోని ఏం చేశాడు? అతడిపై విమర్శలకు కారణమేంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్..
శుక్రవారం రాత్రి టాస్ ఓడి బ్యాంటింగ్ వచ్చిన ఆర్సీబీ (RCB)జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు 146 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై.. ఆ తర్వాత ఏ దశలోనూ ఆర్సీబీ బౌలర్లపై పైచేయి సాధించలేదు. వరుస వికెట్లు పడుతున్న క్రమంలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్ గా పేరున్న ధోని వచ్చి మ్యాచ్ ను గెలిపిస్తాడని అంతా భావించారు. 5 వికెట్ పడిన దగ్గర నుంచి ధోని రాక కోసం ఫ్యాన్స్ ఎదురుచూశారు. వికెట్ పడినప్పుడల్లా తలా వస్తాడని భావించిన ఫ్యాన్స్ కు తొమ్మిదో వికెట్ వరకూ నిరాశే ఎదురైంది. టెయింలడర్లు వచ్చే ఆ స్థానంలో ధోని మైదానంలో అడుగుపెట్టగా.. ఎప్పుడూ ఉండే హడావిడీ ఫ్యాన్స్ నుంచి పెద్దగా కనిపించలేదు.
మ్యాచ్ చేజారాక భారీ షాట్లు
గెలుపు అవకాశం ఉన్న సమయంలో రాకుండా.. మ్యాచ్ పై ఆర్సీబీ పూర్తిగా పట్టు సాధించిన సమయంలో ధోని రావడంపై సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారీ షాట్లు ఆడలేని అశ్విన్ (Ravichandran Ashwin)ను సైతం తలా ముందు పంపి.. అతడి వికెట్ తర్వాత తలా రావడాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. గొప్ప ఫినిషర్ గా ఉన్న పేరును ధోని గత కొన్ని రోజులుగా నిలబెట్టుకోలేకపోతున్నారని సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ఆల్ రౌండర్ల తర్వాత ధోని బ్యాటింగ్ రావడాన్ని తప్పుబడుతున్నారు. ఈ మ్యాచ్ లో ధోని 16 బంతుల్లో 30 రన్స్ చేసి నాటౌట్ గా నిలవగా.. అదే ఇన్నింగ్స్ ముందొచ్చి ఆడుంటే ఫలితం ఇంకోలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read: Bank Holidays April 2025: అలర్ట్.. అలర్ట్.. ఏప్రిల్ లో సగం రోజులు.. బ్యాంక్ సెలవులే..
ధోనిపై మాజీలు విమర్శలు
ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు సైతం ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ రావడాన్ని తప్పుబడుతున్నారు. ధోని ఆ స్థానంలో బ్యాటింగ్ రావడాన్ని తానెప్పుడు సమర్థించనని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అన్నారు. ఇది జట్టుకు ఏమాత్రం మంచి చేయదని అభిప్రాయపడ్డారు. అటు రాబిన్ ఊతప్ప (Robin Uthappa) సైతం సీఎస్కే (CSK) వ్యూహాన్ని తప్పుబట్టాడు. ధోని ముందుగా వచ్చుంటే కనీసం నెట్ రన్ రేట్ అయినా బెటర్ అయ్యేదని చెప్పారు. మరోవైపు టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Virendra Sehwag).. ధోని (MSD)పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ధోని చాలా త్వరగా బ్యాటింగ్ వచ్చారే అంటూ వ్యంగ్యంగా పోస్టు పెట్టాడు. అతడు బ్యాటింగ్ వచ్చాడా? మిగతా బ్యాటర్లు వికెట్లు త్వరగా కోల్పోయి రప్పించారా? ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.