Manchu Vishnu: మంచు విష్ణు.. సీజన్‌తో పనిలేకుండా, సినిమాలతో అస్సలే అవసరం లేకుండా మీడియా, సోషల్ మీడియాలో నిత్యం నానుతుండే యంగ్ హీరో. అదేంటో కానీ.. ఈయన ఏం మాట్లాడినా సరే ఆటోమాటిక్‌గా వైరల్ అయిపోతుంది. ఇక మీమర్స్‌కు, ట్రోలర్స్‌కు ఫుల్ మీల్స్ అంతే. బహుశా విష్ణుకు సోషల్ మీడియాలో ఉన్నంత ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదంటే అర్థం చేసుకోండి. ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ భారీ బడ్జెట్ పెట్టి ‘కన్నప్ప’ (Kannappa) సినిమాను టాలీవుడ్ చరిత్ర పుటల్లోకి ఎక్కించడానికి భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. ఇది విష్ణుకు డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో కీలక నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్-27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో గట్టిగానే విష్ణు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
Read Also- Vishal: శుభమా అని పెళ్లికి రెడీ అవుతున్న వేళ.. విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!
ఓరి బాబోయ్..!
మీరు మీ మొబైల్‌లో డిఫరెంట్‌గా ఎవరి పేరైనా సేవ్ చేసుకుంటారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు విష్ణు లాజిగ్‌గా బదులిచ్చారు. ‘ అవును.. అందరి పేర్లూ అలానే సేవ్ చేసుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కో పేరు పెట్టుకుంటాను. నాన్న గారి నంబర్‌ను మంచు లయన్ కింగ్ అని పెట్టుకున్నాను. వినీ (భార్య విరాన్సికా రెడ్డి) పేరు మామా చీకా అని పెట్టాను. మామా చీకా అంటే స్పానిష్‌లో ద హాట్ విమెన్ అని అర్థం. అమ్మ పేరు వచ్చేసి మంచు క్లారిటీ అని సేవ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆవిడకు ఉన్న క్లారిటీ మాకు ఎవ్వరికీ ఉండదు. మా కజిన్ ఒకతను ఉన్నాడు.. వాడిపేరు వచ్చేసి బాల్ ఇరిటేటెడ్ అని పెట్టుకున్నా. ఒకడికి ఎక్కువ కోపం ఉంటుంది వాడ్ని హల్క్ అని పేరు పెట్టుకున్నా. ప్రభాస్ పేరు వచ్చేసి రెబల్ అని ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉంటుంది’ అని మంచు వారబ్బాయి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో ఈ పేర్లకు సంబంధించిన క్లిప్లింగ్ సోషల్ మీడియాలో ఓ రేంజిలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు, మీమర్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
డ్రీమ్ ఇదే..!
‘ లైఫ్‌లో ఒక్కో స్టేజిలో ఒక్కోటి కొనాలని ఉంటుంది. ఇప్పటికిప్పుడు నా దగ్గర బాగా డబ్బులు ఉంటే మాత్రం న్యూజిలాండ్‌లో ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను. దీంతో పాటు 10 ఎకరాల ల్యాండ్ కూడా కొనాలని ఉంది. ఒక నాలుగు గొర్రెలు, మేకలను పెట్టుకుని అక్కడికి పారిపోతాను. న్యూజిలాండ్‌లోని ఓ ప్లేస్ నాకు చాలా ఫేవరేట్. వరల్డ్‌లోనే నాకు ఫేవరేట్. బ్రహ్మానందంగారు నాకు తండ్రి లాంటి వారు. ఆయన ప్రతిరోజూ ఫోన్ చేసి కన్నప్ప సినిమా గురించి అడుగుతున్నారు. బ్రహ్మానందం, ప్రభాస్, ప్రభుదేవా, మోహన్ లాల్ గారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్.. మేజర్‌గా మన శరత్ కుమార్‌గారు వీళ్లనూ, వీరిచ్చిన ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ మరిచిపోలేను. మూవీ 27న రిలీజ్ అయినప్పుడు కచ్చితంగా అందరికీ మంచి ఫీలింగ్ వస్తుంది. కచ్చితంగా అభిమానులు, ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది’ అని విష్ణు చెప్పుకొచ్చారు. బాబోయ్.. ఈ కామెంట్స్ చూస్తే మీకు నవ్వులు ఆగవు అంతే..!
Read Also- Nagma: నగ్మా పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఆమె లైఫ్‌లోని షాకింగ్ విషయాలు!