Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet) ఉండటంతో సురేఖ సెక్రటేరియట్‌కు వచ్చారు. మీటింగ్ హాల్‌లోకి నడుచుకుంటూ వెళ్తుండగా సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోయారు. ఒక్కసారిగా అలా పడిపోవడంతో వెంటనే అలర్ట్ అయిన వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన వైద్యులను పిలిపించారు. సెక్రటేరియట్ హాల్‌కు చేరుకున్న డాక్టర్లు.. మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. లో-బీపీ, షుగర్ (Sugar) వల్ల సురేఖ కళ్ళు తిరిగి పడిపోయారని వైద్యులు తెలిపారు. గురువారం ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడమే లో-బీపీకి కారణమని, అందుకే షుగర్ లెవల్స్ పడిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. సురేఖకు సచివాలయంలోని (Secretariat) ఆరో అంతస్తులో ఎమర్జెన్సీ వైద్యులు ప్రథమ చికిత్స చేసిన తర్వాత మంత్రి ఆహారం తీసుకున్నారు. ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని, కేబినేట్ భేటీలో పాల్గొనేందుకు వెళ్లిపోయారు.
Read Also- Maganti Gopinath Health Issue: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు తీవ్ర అస్వస్థత
Read Also- Pawan Kalyan: ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్.. టార్గెట్ ఫిక్స్!
ఎలా ఉంది అక్కా..?
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సెక్రటేరియట్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. రాజీవ్ యువవికాసం, వానాకాలం పంటలపై చర్చతో పాటు, ఇందిరమ్మ ఇల్లు, భూభారతిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. సమావేశానికి హాజరైన సురేఖను పరామర్శించారు. ‘ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అక్కా.. అంతా ఓకే కదా?’ అని సురేఖను ఆరోగ్య వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. సురేఖ రిప్లయ్ ఇచ్చారు. ‘ఆరోగ్యం జాగ్రత్త అక్క’ అని చెప్పి.. మరోవైపు వైద్యులను అడిగి కూడా రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు.. హైదరాబాద్‌లో పర్యావరణ దినోత్సవం సందర్బంగా కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను చేయడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. సముద్ర జీవులు, మానవాళి ఆరోగ్యం, జీవవైవిధ్యాన్ని ప్లాస్టిక్ నాశనం చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను వాడకుండా ఉండాలని, ప్లాస్టిక్ ఫ్రీ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ధీమాగా తెలిపారు.
ఈ ఏడాది కూడా..!
బయో డీగ్రేడబుల్ ప్యాకేజింగ్, ప్లాంట్ ఆధారిత ప్లాస్టిక్‌ను సపోర్ట్ చేస్తామని సురేఖ చెప్పారు. ప్లాస్టిక్ నియంత్రణకు గాను 5 ఆర్ (5R) రూల్ తెస్తున్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం వన మహోత్సవ కార్యక్రమం ద్వారా 95 శాతం లక్ష్యాన్ని సాధించామని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ప్రతిఒక్కరూ 5 ఆర్ నిబంధన పాటించాలని పిలుపునిచ్చారు. రిఫ్యూజ్, రెడ్యూజ్, రియూజ్, రీసైకిల్, రీథింక్ విధానాలను పాటించాలని తెలిపారు. పాఠశాలలు, యువత, వ్యాపారులు, పౌరులందరూ చురుగ్గా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించేలా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సీనియర్ అధికారుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.
Read Also- Modi Sindoor Plant: సింధూరం మొక్క నాటిన మోదీ.. అంత స్పెషల్ ఎందుకు?