Mahanati Savitri
Cinema, Viral

Savitri: షాకింగ్.. సావిత్రి బంగారు నగలు కొట్టేసిన ‘నటుడు’ ఎవరు?

Savitri: మహానటి సావిత్రి.. తెలుగు సినీ చరిత్రలో ఒక ధృవతార, ఒక విషాద గాథ. ఆమె కేవలం ఒక నటి మాత్రమే కాదు, నవరసాలను అలవోకగా పండించిన అభినేత్రి, కోట్లాది మంది అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన మహానటి (Mahanati). ఆమె జీవితం ఒక తెరవని పుస్తకంలా అనేక మలుపులు, అపజయాలు, విజయాలు, మరియు చివరికి విషాదంతో నిండిపోయింది. సావిత్రి జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా.. చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆస్తులన్నీ కోల్పోయి, తీవ్ర నిరాశలో, తాగుడుకు బానిసై, కోమాలోకి వెళ్ళి మరణించారని చెబుతుంటారు. అయితే సావిత్రి చివరి రోజుల్లో బంగారు (Gold) నగలు, ఆస్తులను కొట్టేసిన నటుడు, నటుడి భార్య ఎవరు? మహానటి దగ్గర ఎంత బంగారం ఉంది? ‘వెండి తెర సామ్రాజ్ఞి’ అనే పుస్తకంలో ఏం చెప్పారు? ఆ గదిలో సావిత్రి చివరి మాటలు ఏవి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం.

బంగారం దొరుకుతుందని..
సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, ఆమె భర్త గోవిందరావు (సావిత్రి మేనల్లుడు) ఇద్దరూ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బంగారం’ గురించి నివ్వెరపోయే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గోవిందరావు మాట్లాడుతూ ‘ సావిత్రికి బంగారు నగలు అంటే చాలా ఇష్టం. బంగారు ఆభరణాలను ఎక్కువగా ధరిస్తుండేవారు. సావిత్రి ఏ ఫంక్షన్‌కు వెళ్లినా రెడ్ కార్పెట్ పరిచేవారు. ఎందుకంటే ఆమె నడుస్తూ వెళ్తుంతుంటే బంగారం ఏమైనా దొరుకుతుందేమోనని ఆ మ్యాట్స్‌పై కొంతమంది కుర్రాళ్లు అటు.. ఇటు వెతుకుతూ ఉండేవారు. అంతటి వైభవంగా సావిత్రి కనిపించేవారు’ అని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

Read Also- Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి రెండు షాకింగ్ విషయాలు.. ముక్కున వేలేసుకుంటారు!

బీరువాలు సరిపోయేవి కాదు..!
‘ అమ్మకు మొదట్నుంచీ బంగారు ఆభరాణాలు అంటే చాలా ఇష్టం. జ్యుయలరీ షాపుల ఓపెనింగ్స్‌కు అమ్మను పిలిస్తే తప్పకుండా వెళ్తూ ఉండేవారు. ఆ షాపు వారికి మంచి బిజినెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో నగలు పెద్ద ఎత్తునే కొనేసిది. అలా.. అమ్మ నగలు బీరువా నిండుగా ఉండేవి. బంగారంతో ఉండే బాక్సులు బీరువాలో సరిపోయేవి కాదు. అందుకే బంగారు గాజుల్లోకి రిబ్బన్ దూర్చి మరీ ముడేసేది. అలా రిబ్బన్లు కట్టిన గాజులు బీరువాలో చాలా ఉండేవి అని మా ఆమ్మ స్నేహితులు చాలా మంది చెబుతుంటారు. బహుశా అందుకేనేమో ఇన్‌కమ్ టాక్స్ అధికారులు ముందుగా వాటిపైనే పడ్డారు. బీరువాల్లోని నగలను బాక్సులలో తీసుకుని వెళ్లడం అధికారులకు కుదరలేదు. అందుకే పెద్ద బెడ్ షీట్‌ను నేలపైన పరిచి మరీ నగలన్నీ కుప్పగా పోసి పెద్ద మూటగట్టి తీసుకెళ్లారు. ఇష్టపడి మరీ, చేయించుకున్న నగలను అలా తీసుకుని వెళ్తుంటే అమ్మ చాలా బాధపడింది, మనో వేదనకు గురయ్యింది. అమ్మ దగ్గర బంగారు ఆభరణాలు అడిగి తీసుకున్న స్నేహితులు కొంతమంది వాటిని ఒక్కరంటే ఒక్కరూ తిరిగి ఇవ్వలేదు. అటు నగలు ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లు తీసుకెళ్లడం.. ఇటు తీసుకున్న వాళ్లు తిరిగి ఇవ్వకపోవడంతో అమ్మ చాలా కుంగిపోయింది’ అని చెప్పుకొచ్చారు.

ఊహించని రీతిలో…
ఇవన్నీ ఒక ఎత్తయితే ఒకానొక దశలో 1965లో షూటింగ్‌లో ఉండగా కొన్ని నగలు ఓ నటుడు, ఆయన భార్యకు ఇచ్చారు. పీకల్లోతు కష్టాల్లో ఉండగా సరిగ్గా ఇదే సమయంలో సదరు నటుడు, ఆయన భార్య ఇంటికి వచ్చారు. వచ్చీ రాగానే.. ‘ హమ్మయ్యా.. నాకు నా నగలు ఇవ్వడానికే వచ్చింది. ఏవీ తెచ్చావా నా నగలు? ఇలా ఇవ్వు’ అని సావిత్రి అడిగారు. అయితే ఏ నగలు? ఏంటి ఇచ్చేది? అంటూ నటుడి భార్య అన్నారు. ‘ అవే.. ఏ నగలు అంటావేంటి? అప్పుడు షూటింగ్‌లో ఉండగా ఇచ్చాను కదా? జాగ్రత్త చేయమని ఇచ్చాను కదా అవే’ అని సావిత్రి మరోసారి గుర్తు చేశారు. ఈ మాటలకు నటుడు, ఆయన భార్య బదులిస్తూ.. ‘ అవును ఆ నగల గురించి చెప్పడానికే వచ్చాను. ఇంతకముందు కూడా ఎవరితోనో కబురు చేశావు కదా నగలు.. నగలు అనుకుంటూ.. నువ్వు నాకు ఏ నగలు ఇవ్వలేదు.. నా దగ్గర నీకు సంబంధించిన ఏ నగలూ లేవు’ అని హీరో భార్య అన్నారు. దీంతో నివ్వెరపోయిన సావిత్రి.. ఇంత మోసమా? తాను ఎన్నో రకాలు మోసపోయాను కానీ నమ్మినవాళ్లు, నమ్మనివాళ్లు ద్రోహం చేశారు కానీ.. ఇది ఇంకో ద్రోహం అని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

Read Also- KTR: అరెరే.. కేటీఆర్‌కు పెద్ద చిక్కొచ్చి పడిందే.. ఆధారాలతో దిమ్మతిరిగేలా కొట్టారుగా!

ఇవి చాలు నిలబెట్టడానికి..
నగలన్నీ ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లు తీసుకెళ్లిన తర్వాత అప్పట్లో జాగ్రత్త చేయమని చెప్పిన నగలు ఉంటే చాలు అని అనుకున్నారు. అయితే.. ఆ నగలే ఇలా పోవడంతో షాకయ్యారు. ఎందుకంటే.. సావిత్రి ఆశలన్నీ ఆ నగలమీదే పెట్టుకున్నారు. ఈ నగల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినప్పట్నుంచీ అనుకుంటూనే ఉన్నారట. ‘ఇవి చాలు నాకు.. నన్ను నిలబెట్టడానికి’ అని.. తీరా జంకు బొంకు లేకుండా ఆవిడ (నటుడి భార్య) లేవు అనే మాట అనేసరికి తట్టుకోలేకపోయారు. అంతే శిలువైపోయారు.. ప్రాణం ఉందని చూసి సావిత్రిని పడుకోబెట్టి.. తులుపులు వేసేసి అక్కడ్నుంచి తిన్నగా జారుకున్నారు ఆ నటుడి భార్య. ఈ విషయాలన్నీ ‘వెండి తెర సామ్రాజ్ఞి’ అనే పుస్తకంలో పూసగుచ్చినట్లుగా ఉన్నాయి. పేజీ నంబర్ 315, 316లో ఈ విషయాలన్నీ ఉన్నాయి.

ఇంతకీ ఆ నటుడు ఎవరు?
సావిత్రిని ఇంతగా మోసం చేసిన ఆ నటుడు ఎవరు? ఆ నటుడి భార్య ఎవరు? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలో ఎవరికి తోచినట్లుగా వాళ్లు అదిగో ఆ హీరోనే.. ఇదిగో ఈ హీరోనే.. అంటూ చిత్రవిచిత్రాలుగా పేర్లు తెరపైకి తెస్తున్నారు. ఇందులో ఎక్కువగా సీనియర్ నటుడి పేరు వస్తుండటం గమనార్హం. అంతేకాదు.. ఆ గదిలో మాట్లాడినవే సావిత్రి చివరి మాటలు కూడా. ఇంతకీ ఆ రాత్రి ఏం మాట్లాడారు? ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు? ఈ ట్వీట్‌లో చూడొచ్చు.

 

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం